Asia Cup 2025 key match today between Sri Lanka and Afghanistan
SL vs AFG : ఆసియాకప్ 2025లో గ్రూప్-ఏ నుంచి సూపర్-4కి చేరే రెండు జట్లు ఏవో తేలిపోయాయి. భారత్, పాక్ జట్లు గ్రూప్-ఏ నుంచి సూపర్-4కి అర్హత సాధించగా ఒమన్, యూఏఈలు టోర్నీ నుంచి నిష్ర్కమించాయి. అయితే.. గ్రూప్-బిలో మాత్రం సూపర్-4కి చేరుకునే జట్లు ఏవో ఇంకా తేలలేదు. ఇక టోర్నీలో భాగంగా నేడు (గురువారం, సెప్టెంబర్ 18న) అఫ్గానిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్ (SL vs AFG)ఫలితంతో గ్రూప్-బి నుంచి సూపర్-4కి వెళ్లే జట్లు ఏవో తేలిపోనున్నాయి. గ్రూప్-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, హాంగ్‌కాంగ్ జట్లు ఉన్నాయి. ఇందులో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన హాంగ్‌కాంగ్ జట్టు రేసు నుంచి ఎప్పుడో నిష్ర్కమించింది.
Muhammad Waseem : పాక్ పై అందుకే ఓడిపోయాం.. యూఏఈ కెప్టెన్ వసీం కామెంట్స్ వైరల్..
ఇక శ్రీలంక జట్టు ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడగా రెండింటిలో విజయం సాధించి 4 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడగా రెండింటిలో గెలుపొంది 4 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. అదే విధంగా అఫ్గాన్ జట్టు రెండు మ్యాచ్‌లు ఆడగా ఓ మ్యాచ్‌లో గెలిచి 2 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.
అఫ్గాన్, లంక మ్యాచ్ (SL vs AFG) ఎందుకు కీలకం అంటే..?
అఫ్గాన్, లంక జట్ల మధ్య అబుదాబి వేదికగా జరగనున్న మ్యాచ్ ఫలితం ఆధారంగానే గ్రూప్-బి నుంచి సూపర్-4కి వెళ్లే జట్లు నిర్ధారణ అవుతాయి. ఈ మ్యాచ్‌లో లంక జట్టు గెలిస్తే ఆరు పాయింట్లతో సూపర్4లో అడుగుపెడుతోంది. లంకతో పాటు బంగ్లాదేశ్ కూడా వెలుతుంది.
ఒకవేళ అఫ్గానిస్తాన్ విజయం సాధిస్తే మాత్రం అప్పుడు రేసు ఆసక్తికరంగా మారుతుంది. మూడు జట్లు కూడా నాలుగు పాయింట్లతో సమానంగా ఉంటాయి. మెరుగైన రన్‌రేటు ఉన్న రెండు జట్లు సూపర్-4కి అర్హత సాధిస్తాయి.
ఇక్కడ శ్రీలంక నెట్‌రన్‌రేటు +1.546గా ఉంది. బంగ్లాదేశ్ నెట్‌రన్‌రేటు (-0.270) కంటే అఫ్గాన్ నెట్‌రన్‌రేటు (+2.150) చాలా మెరుగ్గా ఉంది. దీని బట్టి చూస్తే.. లంకతో మ్యాచ్‌లో అఫ్గాన్ గెలిస్తే మెరుగైన రన్‌రేటు ఉండడంతో.. అఫ్గాన్ తదుపరి దశకు వెలుతుంది. లంక కూడా మరీ చిత్తుగా ఓడకపోతే ఆ జట్టు కూడా వెలుతుంది.
ఈ క్రమంలో ఈ కీలక మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించాలని బంగ్లాదేశ్ అభిమానులు కోరుకుంటున్నారు.