×
Ad

PAK vs BAN : ఇది క‌దా పాకిస్తాన్ అంటే.. స్కూల్ లెవ‌ల్ ఫీల్డింగ్‌.. వీడియో వైర‌ల్‌..

బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో (PAK vs BAN) పాకిస్తాన్ ఫీల్డింగ్‌కు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Asia Cup 2025 Pakistan miss out on easy run out chance vs Bangladesh

PAK vs BAN : ఆసియాక‌ప్ 2025లో త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ విజ‌యం సాధించింది. గురువారం దుబాయ్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో (PAK vs BAN) జ‌రిగిన మ్యాచ్‌లో 11 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. దీంతో పాక్ ఫైన‌ల్ కు అర్హ‌త సాధించింది. ఆదివారం (సెప్టెంబ‌ర్ 28) జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్‌తో పాక్ అమీతుమీ తేల్చుకోనుంది.

బంగ్లాతో జ‌రిగిన మ్యాచ్‌లో పాక్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 135 ప‌రుగులు చేసింది. పాక్ బ్యాట‌ర్ల‌లో మహ్మద్ హారిస్ (31; 23 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), మహ్మద్ నవాజ్ (25; 15 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స‌ర్లు) రాణించారు. కెప్టెన్ స‌ల్మాన్ అలీ అఘా (19), షాహీన్ అఫ్రిది (19)లు ఫ‌ర్వాలేద‌నిపించారు. బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌లో తస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు తీశాడు. మెహేదీ హసన్, రిషద్ హుస్సేన్ లు చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ముస్తాఫిజుర్ రెహ్మ‌న్ ఓ వికెట్ సాధించాడు.

IND vs WI : క‌రుణ్ నాయ‌ర్ పై వేటు.. తెలుగోడికి చోటు.. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఇదే..

అనంత‌రం 136 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 124 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. బంగ్లా బ్యాట‌ర్ల‌లో షమీమ్ హుస్సేన్ (30; 25 బంతుల్లో 2 సిక్స‌ర్లు) రాణించాడు. మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో ఓట‌మి త‌ప్ప‌లేదు. పాక్ బౌల‌ర్ల‌లో ష‌హీన్ అఫ్రిది, హ‌రీస్‌లు చెరో మూడు వికెట్లు తీశారు. సైమ్ అయూబ్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. మ‌హ్మ‌ద్ న‌వాజ్ ఓ వికెట్ తీశారు.

ఈజీ ర‌నౌట్ మిస్‌..

ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఫీల్డింగ్ చాలా పేల‌వంగా ఉంది. బంగ్లా బ్యాట‌ర్‌ను ఈజీగా ర‌నౌట్ చేసే అవ‌కాశాన్ని కోల్పోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. స్కూల్ స్థాయి ఫీల్డింగ్ అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ఐదో ఓవ‌ర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఓవ‌ర్‌ను షాహీన్ వేశాడు. తొలి బంతికి తౌహిద్ హృదయ్ బ్యాక్ వ‌ర్డ్ పాయింట్ దిశ‌గా షాట్ ఆడాడు. అక్క‌డే ఫీల్డింగ్ చేస్తున్న సైమ్ అయూబ్ డైవ్ చేసి బంతిని ఆపాడు. ప‌రుగు తీసేందుకు బంగ్లా బ్యాట‌ర్లు ప్ర‌య‌త్నించారు. ఈలోగా పాక్ ఫీల్డ‌ర్ బంతిని ఆప‌డంతో బ్యాట‌ర్లు గంద‌ర‌గోళానికి గురి అయ్యారు. ఇద్ద‌రు బ్యాట‌ర్లు కూడా వికెట్ కీప‌ర్ ఎండ్ వైపుకు ప‌రిగెత్తారు.

Sunil Gavaskar : బంగ్లాదేశ్ పై తుఫాన్ ఇన్నింగ్స్‌.. అభిషేక్ శ‌ర్మ పై మండిప‌డిన సునీల్ గ‌వాస్క‌ర్‌..

బంతిని ఆపిన ఆయూబ్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్ వికెట్ల వైపు బంతిని త్రో చేశాడు. అయితే.. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఏ ఒక్క పాక్ ఆట‌గాడు లేక‌పోవ‌డంతో ఈజీగా ర‌నౌట్ చేసే అవ‌కాశాన్ని కోల్పోయింది. మ‌ళ్లీ వాళ్లు బాల్ అందుకునేలోగా.. బంగ్లా బ్యాట‌ర్ సైఫ్ హ‌స‌న్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్ కు చేరుకున్నాడు.