Site icon 10TV Telugu

Asia Cup 2025 : యూఏఈ వేదిక‌గా ఆసియాక‌ప్ 2025.. భారీ రికార్డు పై ర‌షీద్ ఖాన్ క‌న్ను..

Asia Cup 2025 Rashid Khan Eye on Bhuvneshwar Kumar Massive Bowling Record

Asia Cup 2025 Rashid Khan Eye on Bhuvneshwar Kumar Massive Bowling Record

Asia Cup 2025 : టీ20 క్రికెట్‌లో అత్యుత్త‌మ బౌల‌ర్ల‌లో ఒక‌డిగా కొన‌సాగుతున్నాడు అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్. సెప్టెంబ‌ర్ 9 నుంచి ఆసియా క‌ప్ 2025 (Asia Cup 2025) ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో ర‌షీద్ మూడు వికెట్లు తీస్తే ఓ అరుదైన ఘ‌న‌త‌ను అందుకోనున్నాడు. ఈ టోర్న‌మెంట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా రికార్డుల‌కు ఎక్క‌నున్నాడు.

టీ20క్రికెట్ ఫార్మాట్‌లో నిర్వ‌హించిన ఆసియాక‌ప్‌ల‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా ప్ర‌స్తుతం టీమ్ఇండియా పేస‌ర్ భువనేశ్వ‌ర్ కుమార్ ఉన్నాడు. అత‌డు 6 మ్యాచ్‌ల్లో 5.34 ఎకాన‌మిఈతో 13 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ జాబితాలో ర‌షీద్ 8 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి నాలుగో స్థానంలో ఉన్నాడు. యూఏఈ బౌలర్లు అంజద్‌ జావెద్‌ (7 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు), మొహమ్మద్‌ నవీద్‌ (7 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

Hardik Pandya : ఆసియాక‌ప్ 2025లో హార్దిక్ పాండ్యా చ‌రిత్ర సృష్టించేనా? ఇంకో 6 వికెట్లు తీస్తే..

టీ20 ఫార్మాట్‌లో ఆసియాక‌ప్‌ల‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్లు వీరే..
* భువ‌నేశ్వ‌ర్ కుమార్ (భార‌త్) – 6 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు
* అంజద్‌ జావెద్ (యూఏఈ) – 7 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు
* మ‌హ్మ‌ద్ న‌వీద్ (యూఏఈ) – 7 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు
* ర‌షీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్‌) – 8 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు
* హార్దిక్ పాండ్యా (భార‌త్‌) – 8 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు

ఇప్ప‌టి వ‌ర‌కు టీ20 ఫార్మాట్‌లో ఆసియా క‌ప్ ఎన్ని సార్లు జ‌రిగింది?

టీ20 ఫార్మాట్‌లో ఆసియాక‌ప్ ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సార్లు జ‌రిగింది. యూఏఈ వేదిక‌గా సెప్టెంబ‌ర్ 9 నుంచి జ‌ర‌గ‌బోయేది మూడో ఎడిష‌న్‌. 2016లో తొలిసారి టీ20 ఫార్మాట్‌లో నిర్వ‌హించిన ఈ టోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇచ్చింది. ఆ త‌రువాత 2022లో యూఏఈ వేదిక‌గానే రెండోసారి జ‌రిగింది. కాగా.. తొలి ఎడిష‌న్‌లో భార‌త్ విజేత‌గా నిల‌వ‌గా, రెండో ఎడిష‌న్‌లో శ్రీలంక క‌ప్పును ముద్దాడింది.

Exit mobile version