Sanju Samson vs Shubman : ఆసియా కప్ 2025కి మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. అయినప్పటికి కూడా భారత జట్టు ఓపెనింగ్ కాంబినేషన్ విషయం పై ఇప్పటికి కూడా ఓ స్పష్టత రాలేదు. ఓ ఓపెనర్‌గా అభిషేక్ శర్మ ఫిక్స్ కాగా.. మరో ఓపెనర్‌గా సంజూ శాంసన్, శుభ్‌మన్ గిల్ ల (Sanju Samson vs Shubman)మధ్య పోటీ ఉంది. వీరిద్దరిలో ఎవరు అభిషేక్‌కు తోడుగా ఓపెనింగ్ చేస్తారా ? అని అంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్ టీ20 గణాంకాలను ఓ సారి చూద్దాం.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో గిల్ కంటే ఎక్కువ మ్యాచ్‌లను సంజూ శాంసన్ ఆడాడు. శాంసన్ 42 మ్యాచ్‌ల్లో 38 ఇన్నింగ్స్‌ల్లో 25.32 సగటు, 152.38 స్ట్రైక్‌రేటుతో 861 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు రెండు అర్థశతకాలు ఉన్నాయి.
BCCI : టీమ్‌ఇండియా స్పాన్సర్ షిప్ కోసం బిడ్లను ఆహ్వానించిన బీసీసీఐ.. కండీషన్స్ అప్లై..
ఇక గిల్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు గిల్ 21 టీ20 మ్యాచ్‌ల్లు ఆడాడు. 30.42 సగటు 139.27 స్ట్రైక్‌రేటుతో 578 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు అర్థశతకాలు ఉన్నాయి.
కేరళ క్రికెట్ లీగ్‌లో అదరగొడుతున్న సంజూశాంసన్..
అయితే.. ప్రస్తుతం జరుగుతున్న కేరళ క్రికెట్ లీగ్‌లో సంజూ శాంసన్ అదరగొడుతున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న సంజూ నాలుగు మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా 51 బంతుల్లో 121 పరుగులు, 46 బంతుల్లో 89 పరుగులు, 37 బంతుల్లో 62 పరుగులు, 41 బంతుల్లో 83 పరుగులు సాధించాడు.
Gautam Gambhir : కోహ్లీ కాదు.. గంభీర్ దృష్టిలో మోస్ట్ స్టైలిష్ ఎవరంటే?
వైస్ కెప్టెన్‌గా గిల్..
ఆసియా కప్ 2025లో శుభ్‌మన్ గిల్ ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. దీంతో అతడు తుది జట్టులో ఉండడం దాదాపుగా ఖాయమే. అయితే.. అతనికి ఏ స్థానంలో ఆడిస్తారు అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఒకవేళ గిల్ ఓపెనర్‌గా దించి సంజూ ను మిడిల్ ఆర్డర్‌కు మార్చే అవకాశాన్ని కొట్టిపారేయలేము. అయితే.. అలా చేస్తే సంజూ ఆట తీరు దెబ్బ తినే అవకాశాలు లేకపోలేదు అని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
దీంతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.