Asia cup 2025 super 4 match Axar Patel doubtful for Pakistan clash
IND vs PAK : ఆసియాకప్ 2025లో భారత్ అదరగొడుతోంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. అబుదాబి వేదికగా శుక్రవారం ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 21 పరుగుల తేడాతో విజయం సాధించి గ్రూప్-ఏలో అగ్రస్థానంతోనే సూపర్-4లో అడుగుపెట్టింది.
సూపర్-4లో భాగంగా భారత్ ఆదివారం పాకిస్తాన్‌తో (IND vs PAK) తలపడనుంది. అయితే.. ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఆడడం అనుమానంగా మారింది. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు.
క్యాచ్ అందుకోబోయి..
ఒమన్ ఇన్నింగ్స్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 15 ఓవర్‌ను శివమ్ దూబె వేశాడు. ఈ ఓవర్‌లోని తొలి బంతికి ఒమన్ బ్యాటర్ హమీద్ మీర్జా భారీ షాట్ ఆడాడు. బంతి గాల్లోకి లేచింది. మిడాఫ్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన అక్షర్ క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు.
Suryakumar Yadav : ఒమన్ పై కష్టంగా గెలిచిన భారత్.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడంటే?
ఈ సమయంలో అతడు బ్యాలెన్స్ కోల్పోయాడు. అతడి తల నేలకు తగిలింది. వెంటనే అతడు నొప్పితో విలవిలలాడాడు. ఫిజియోమైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించాడు. అనంతరం అక్షర్ మైదానం నుంచి బయటకు వెళ్లాడు. మిగిలిన మ్యాచ్‌లో అతడు మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు.
పాక్ పై ఆడతాడా?
గత కొన్నాళ్లుగా అక్షర్‌పటేల్ కీలక ఆటగాడిగా ఉన్నాడు. అటు బంతి, ఇటు బ్యాట్ రెండింటితోనూ జట్టుకు ఉపయుక్తంగా మారాడు. ఈ క్రమంలో అతడు పాక్‌తో మ్యాచ్‌కు దూరం అయితే అది భారత్‌కు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.
Sanju Samson : టీ20 క్రికెట్‌లో సంజూ శాంసన్ అరుదైన ఘనత.. ఎంఎస్ ధోని సిక్సర్ల రికార్డు బ్రేక్..
కాగా.. మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో టీమ్ఇండియా పీల్డింగ్ కోచ్ దిలీప్.. అక్షర్ గాయంపై స్పందించాడు. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నాడని చెప్పాడు. అయినప్పటికి పాక్‌తో మ్యాచ్‌కు మధ్య కేవలం ఒక్క రోజు విరామం మాత్రమే ఉండడంతో అక్షర్ ఆడడం సందేహంగా మారింది. అక్షర్ దూరమైతే అప్పుడు భారత్ ముగ్గురు స్పిన్నర్ల వ్యూహాన్ని మార్చుకోవాల్సి వస్తుంది.