IND-w VS BAN-w : శతకంతో చెలరేగిన షఫాలీ వర్మ.. బంగ్లాదేశ్ ముందు భారీ టార్గెట్..
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భాగంగా సెమీఫైనల్ మ్యాచ్లో (IND-w VS BAN-w ) భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్లు తలపడుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- September 20, 2026 / 12:18 PM IST
Asian Games 2026 IND-w VS BAN-w Shafali Verma century helps team india score 240 in 20 overs
IND-w VS BAN-w : జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భాగంగా సెమీఫైనల్ మ్యాచ్లో భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్లు తలపడుతున్నాయి. టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ (100 నాటౌట్; 49 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్సర్లు)శతకంతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో బంగ్లాదేశ్ ముందు 196 పరుగుల లక్ష్యం నిలిచింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఓపెనర్లు స్మృతి మంధాన (37; 19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), షఫాలీ వర్మ లు శుభారంభం అందించారు. 6 ఓవర్లలో తొలి వికెట్కు 72 పరుగులు జోడించారు. వేగంగా ఆడే క్రమంలో మంధాన ఔట్ అయింది. వన్ డౌన్లో వచ్చిన బ్యాటర్ కమలినీ (3) విఫలమైంది. అయినప్పటికి కూడా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (40; 33 బంతుల్లో 6 ఫోర్లు)తో కలిసి షఫాలీ దూకుడుగా ఆడింది.
Smriti Mandhana : చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. మహిళల టీ20 క్రికెట్లో ఏకైక ప్లేయర్..
ఆరంభం నుంచే బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా 49 బంతుల్లో శతకాన్ని అందుకుంది. రిచా ఘోష్ (2 ) విఫలమైంది. బంగ్లా బౌలర్లలో మరుఫా అక్తర్, శంజిదా అక్తర్ మేఘల, రబేయా ఖాన్, నహిదా అక్తర్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
INNINGS BREAK!
A Shafali Sharma show puts up a big total for #TeamIndia in the semi-final 🙌
Over to the bowlers now!
Updates ▶️ https://t.co/zMJKYRAVhE#AsianGames pic.twitter.com/ZDGRqehLGs
— BCCI Women (@BCCIWomen) September 20, 2026
