Ask The Selectors Karun Nair Breaks Silence On West Indies Test Series Snub
Karun Nair : అక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులు గల బృందాన్ని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోనే భారత్ బరిలోకి దిగనుంది. వైస్ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఎంపిక అయ్యాడు.
కాగా.. ఈ 15 మంది సభ్యులు గల బృందంలో సీనియర్ ఆటగాడు కరుణ్ నాయర్‌కు (Karun Nair) చోటు దక్కలేదు. దాదాపు ఎనిమిదేళ్ల తరువాత ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక అయిన నాయర్ అక్కడ ఘోరంగా విఫలం అయ్యాడు. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన నాయర్ 25.62 సగటుతో 205 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడిపై వేటు పడినట్లుగా సమాచారం. దీనిపై కరుణ్ నాయర్ స్పందించాడు.
Saim Ayub : సైమ్ అయూబ్.. పాకిస్తాన్ ‘డక్’ స్టార్.. ఫైనల్‌లో భారత్‌తో కూడా ఇలాగే ఆడితే..
విండీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక కాకపోవడం పట్ల కరుణ్ నాయర్ నిరాశను వ్యక్తం చేశాడు. సెలక్టర్లే సమాధానం చెప్పాలని కోరాడు. ‘విండీస్‌తో సిరీస్ కోసం ఎంపిక అవుతానని భావించాను. అయితే.. అలా జరగలేదు. ఇప్పుడు ఏం చెప్పాలో తెలియడం లేదు. దీనిపై ఎక్కువగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. సెలక్టర్లు ఏం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారో వారినే అడగాలి.’ అని కరుణ్ నాయర్ అన్నాడు.
ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టులో మ్యాచ్‌లో ఎవ్వరూ ఆడనప్పుడు హాఫ్ సెంచరీ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. జట్టు కోసం కంట్రిబ్యూట్ చేశానని, ఆ మ్యాచ్‌లో టీమ్ఇండియా గెలిచిందన్నాడు. అయితే.. ప్రస్తుతం అవేవీ పరిగణలోకి తీసుకోలేదని వాపోయాడు.
అగార్కర్ చెప్పింది ఇదే..
అంతకముందు జట్టును ఎంపిక చేసిన సమయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మీడియాతో మాట్లాడాడు. నాయర్‌ను ఎందుకు ఎంపిక చేయలేదు అన్న విషయాన్ని వివరించాడు. ఇంగ్లాండ్ పర్యటనలో కరుణ్ నాయర్ నుంచి చాలా ఆశించినట్లుగా చెప్పుకొచ్చాడు. నాలుగు టెస్టులు ఆడితే.. కేవలం ఒక్క ఇన్నింగ్స్‌లోనే అతడు రాణించాడని మిగిలిన వాటిల్లో విఫలం అయ్యాడని తెలిపాడు.
Jaker Ali : అందుకే పాక్ చేతిలో ఓడిపోయాం.. లేదంటేనా.. బంగ్లాదేశ్ కెప్టెన్ జాకీర్ అలీ కామెంట్స్..
దీంతో విండీస్‌తో టెస్టు సిరీస్ కోసం దేవ్‌దత్ పడిక్కల్ వైపు చూశామన్నాడు. ప్రతి ఒక్కరికి కనీసం 15 నుంచి 20 టెస్టుల వరకు ఆడే ఇవ్వాలని తాను కోరుకుంటానని, అయితే.. దురదృష్టవశాత్తూ కొన్ని సార్లు అలా జరగకపోవచ్చునని చెప్పుకొచ్చాడు.