AUS vs ENG 4th Test ICC rated the pitch used in Melbourne
AUS vs ENG : యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇటీవల ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు మెల్‌బోర్న్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. పిచ్ విపరీతంగా బౌలర్లకు సహకరించింది. ఈ మ్యాచ్‌లో (AUS vs ENG) తొలి రోజు 20 వికెట్లు పడగా రెండో రోజు 16 వికెట్లు నేలకూలాయి. దీంతో పిచ్ పై అనేక విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ పిచ్ కు సోమవారం ఐసీసీ రేటింగ్ ఇచ్చింది. పిచ్ అసంతృప్తికరం అంటూ ఓ డీమెరిట్ పాయింట్‌ను కేటాయించింది.
‘మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రోవ్ నివేదిక ఆధారంగా యాషెస్ నాలుగో టెస్టు కోసం వేదిక అయిన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లోని పిచ్ కు అసంతృప్తికరం అని రేటింగ్ ఇస్తున్నాం. ఈ స్టేడియానికి ఓ డీమెరిట్ పాయింట్ ను చేర్చాం.’ అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
Abhishek Sharma : అభిషేక్.. ఆ కొట్టుకు ఏందీ సామీ.. 60 నిమిషాల్లో 45 సిక్సర్లు..
ఒక వేదికకు ఆరు డీమెరిట్ పాయింట్లు చేరితే.. ఆ వేదికపై 12 నెలల పాటు నిషేదం విధించబడుతుంది. ఆ సమయంలో ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆ స్టేడియంలో నిర్వహించడానికి వీలుండదు.
ఇదిలా ఉంటే.. ఐసీసీ పిచ్ రేటింగ్‌లో నాలుగు రకాల కేటగిరీలు ఉంటాయి. వెరీ గుడ్, సంతృప్తికరం, అసంతృప్తికరం, అన్‌ఫిట్ అనే కేటగిరీలు ఉంటాయి.
IND vs NZ : న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హార్దిక్ తో పాటు ఆ స్టార్ ఆటగాడికి విశ్రాంతి!
Match referee Jeff Crowe hands down verdict on the MCG pitch used for the Boxing Day Test 👀#WTC27 | #AUSvENG
https://t.co/YdKIf8RBQu— ICC (@ICC) December 29, 2025
మెల్‌బోర్న్ మ్యాచ్‌లో కనీసం ఒక్క బ్యాటర్ కూడా అర్ధశతకాన్ని చేయలేదు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలిచింది. ఇక ఇప్పటికే యాషెస్ సిరీస్ ఆసీస్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆసీస్ ఆధిక్యం 3-1గా ఉంది.