Pat Cummins
WTC Final: వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ (WTC) ఫైనల్లో దక్షిణాఫ్రికా చాంపియన్ గా నిలిచింది. శనివారం ముగిసిన ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు ఐదు వికెట్లు తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. సఫారీ జట్టు విజయంలో మార్క్‌క్రమ్ (103 పరుగులు), కెప్టెన్ టెంబా బవుమా (66 పరుగులు) కీలక భూమిక పోషించారు. ఈ విజయంతో సౌతాఫ్రికా 27ఏళ్ల కలను సాకారం చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న ఐసీసీ టైటిల్ ను అందుకుంది. తమపై పడిన చోకర్స్ ముద్రను ఈ విజయంతో సఫారీ జట్టు చెరిపేసుకుంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభంలో సఫారీ జట్టుపై ఆస్ట్రేలియా సునాయసంగా విజయం సాధిస్తుందని అధిక శాతం మంది క్రికెట్ ఫ్యాన్స్ భావించారు. కానీ, సపారీ జట్టు ఆటగాళ్లు అద్భుత ఆటతీరును కనబర్చి ఆసీస్ జట్టును సునాయాసంగా ఓడించారు. ఫైనల్ మ్యాచ్ లో ఓటమి అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. సౌతాఫ్రికా జట్టుపై ప్రశంసల జల్లు కురిపించిన కమ్మిన్స్.. వారిద్దరి వల్లే మేము ఓడిపోయామని చెప్పుకొచ్చారు.
‘‘సౌతాఫ్రికా జట్టు ఆటతీరు అద్భుతంగా ఉంది. వారు ఈ టైటిల్ ను గెలుచుకోవటంలో అర్హులు. ప్రతీ మ్యాచ్ లోనూ పరిస్థితులు వేగంగా మారుతుంటాయి. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్ లో చాలా వేగంగా పరిస్థితి మా చేయిదాటిపోయింది. మేం కొన్ని విషయాల్లో మెరుగ్గా రాణించలేదు. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం తరువాత ప్రత్యర్థిపై ఒత్తిడి తేలేక పోయాం. నాలుగో ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా మాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మార్‌క్రమ్, బవుమా అద్భుత ఆటతీరును కనబర్చారు. వారు క్రీజులో పాతుకుపోయి మా విజయ అవకాశాలను పూర్తిగా దూరం చేశారు. ఈ విజయానికి వారు పూర్తి అర్హులు.’’ అంటూ కమ్మిన్స్ చెప్పారు.
🚨 THE MOMENT WHICH SOUTH AFRICA WAITED FOR 27 YEARS 🥺
– South Africa, the New Champions of WTC. pic.twitter.com/KVNCals5b4
— Johns. (@CricCrazyJohns) June 14, 2025
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 212 పరుగులు చేసింది. ఆ తరువాత దక్షిణాప్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌కు 74 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో 207 పరుగులకు ఆసీస్ ఆలౌట్ కాగా.. సఫారీల ముందు 282 లక్ష్యం నిలిచింది. ఈ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఛేదించి డబ్ల్యూటీసీ విజేతగా నిలిచింది.