IND vs AUS Test Match: ఆసీస్‌కు మరో ఎదురుదెబ్బ.. ఉన్నపళంగా స్వదేశానికి కెప్టెన్ పాట్ కమిన్స్ ..

ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ రెండో టెస్టు పూర్తయిన అనంతరం స్వదేశానికి తిరిగి వెళ్లాడు. వ్యక్తిగత కారణాల నిమిత్తం ఆయన ఉన్నపళంగా స్వదేశానికి వెళ్లినట్లు తెలిసింది.

AUS captain Cummins

IND vs AUS Test Match: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, ఇండియా జట్ల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఇండియాలో జరుగుతుంది. ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఈ రెండు టెస్టుల్లో టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే, ఈ రెండు టెస్టులు మూడు రోజుల్లోనే ముగిసిపోవటం గమనార్హం. రెండు వరుస మ్యాచ్‌లలో ఓటమితో ఆందోళనలో ఉన్న ఆసీస్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మూడో టెస్టుకు ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Ind Vs Aus 2nd Test: బెడిసికొట్టిన ఆసీస్ ప్లాన్.. ఆ రెండు షాట్లు కొంపముంచాయి ..

ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ రెండో టెస్టు పూర్తయిన అనంతరం స్వదేశానికి తిరిగి వెళ్లాడు. వ్యక్తిగత కారణాల నిమిత్తం ఆయన ఉన్నపళంగా స్వదేశానికి వెళ్లినట్లు తెలిసింది. కమిన్స్ కుటుంబంలో ఒకరు అనారోగ్య సమస్యతో బాధపడుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో కమిన్స్ స్వదేశానికి వెళ్లాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, మూడో టెస్టు మ్యాచ్ మొదలయ్యే సమయానికి కమిన్స్ తిరిగి జట్టులోకి చేరుతాడని సమాచారం.

India vs Australia 2nd Test Match: రెండో టెస్టునూ మూడు రోజుల్లో ముగించేశారు.. ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం..

మూడో టెస్ట్ మ్యాచ్ మార్చి 1 నుంచి ఇండోర్ లో జరుగుతుంది. ఆ మ్యాచ్ కు మరో పది రోజుల సమయం ఉండటంతో ఆలోపు జట్టులో చేరుతాడని తెలుస్తోంది. మూడో టెస్టు సమయానికి కమిన్స్ అందుబాటులోకి రాకపోతే స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే స్మిత్ సారథ్యంలో ఆసీస్ జట్టు ఇండోర్ వేదికగా మూడో టెస్టులో భారత్‌తో తలపడనుంది.