India vs Australia 2nd Test Match: రెండో టెస్టునూ మూడు రోజుల్లో ముగించేశారు.. ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం..

మూడో రోజు 61/1 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ బ్యాటర్లకు జడేజా, అశ్విన్ చుక్కలు చూపించారు. వీరి స్పిన్ బౌలింగ్ దాటికి బ్యాట్స్ మెన్ ఎక్కువ సేపు క్రీజ్ లో నిలవలేక పోయారు.

India vs Australia 2nd Test Match: రెండో టెస్టునూ మూడు రోజుల్లో ముగించేశారు.. ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం..

IND vs AUS

India vs Australia 2nd Test Match: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. మొదటి టెస్టులో మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించి ఘన విజయం సాధించిన టీమిండియా.. అదే తరహాలో రెండో టెస్టులోనూ ఆసీస్‌ను చిత్తుచేసింది. మూడో రోజు 61/1 పరుగులతో ఆటను ప్రారంభించిన ఆసీస్‌కు ఆదినుంచి ఎదురుదెబ్బలే తగిలాయి. అశ్విన్, జడేజా స్పిన్ దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు పట్టుమని పది నిమిషాలు కూడా క్రీజ్ లో నిలవలేక పోయారు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 113 పరుగులకే ఆలౌట్ అయింది. 115 పరుగుల లక్ష్యంగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఆదిలో రాహుల్ వికెట్ కోల్పోయినప్పటికీ.. ఆచితూచి ఆడుతూ టీమిండియా బ్యాటర్లు స్కోర్ బోర్డును పెంచారు. దీంతో నాలుగు వికెట్లు నష్టపోయిన ఆసీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని టీమిండియా చేధించింది. రవీంద్ర జడేజా (7/42), రవిచంద్రన్ అశ్విన్ (3/59) ఆసీస్ ఓటమిలో కీలక భూమిక పోషించారు.

జడేజా దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు విలవిల ..

మూడో రోజు 61/1 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ బ్యాటర్లకు జడేజా, అశ్విన్ చుక్కలు చూపించారు. వీరి స్పిన్ బౌలింగ్ దాటికి బ్యాట్స్ మెన్ ఎక్కువ సేపు క్రీజ్ లో నిలవలేక పోయారు. మూడోరోజు మ్యాచ్ ప్రారంభమైన మొదటి ఓవర్లోనే ట్రావిస్ హెడ్ (43)ను అశ్విన్ ఔట్ చేశాడు. కొద్దిసేపటికే స్టీవ్ స్మిత్ (9)అశ్విన్ ఔట్ చేశాడు. దూకుడుగా ఆడుతున్న లబుషేన్ (35)ను జడేజా పెవిలియన్ బాట పట్టించాడు. మరుసటి ఓవర్‌కే రెన్ షా(2)ను అశ్విన్ ఔట్ చేయగా.. ఆ తరువాత వరుసగా అన్ని వికెట్లను జడేజా తన ఖాతాలో వేసుకున్నాడు. జడేజా స్పిన్ ధాటికి కనీసం పది నిమిషాలు కూడా ఆసీస్ బ్యాటర్లు క్రీజ్ లో నిలవలేక పోయారు. వరుస వికెట్లు కోల్పోవటంతో ఆస్ట్రేలియా 113 పరుగులకు ఆలౌట్ అయింది.

India vs Australia 2nd Test Match: రెండో టెస్టు‌లోనూ భారత్‌దే విజయం.. ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో గెలుపు .. LIVE UPDATE

115 పరుగుల లక్ష్యంగా బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కే.ఎల్. రాహుల్ (1) మరోసారి విఫలమయ్యాడు. నాథన్ లైయన్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. రోహిత్ శర్మ దూకుడుగా ఆడటంతో టీమిండియా స్కోర్ బోర్డు కొద్దిసేపు పరుగు పెట్టింది. 20 బంతులు ఆడిన రోహిత్ శర్మ 31 పరుగులు చేశాడు. అందులో మూడు ఫోర్లు, రెండు సిక్స్ లు ఉన్నాయి. అయితే రెండో పరుగుకు ప్రయత్నించే క్రమంలో రోహిత్ రనౌట్ రూపంలో పెవిలియన్ బాటపట్టాడు. కోహ్లీ (20) తక్కువ పరుగులకే అవుట్ కాగా, ఆ తరువాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (12)  పెవిలియన్ బాటపట్టాడు. చివరిలో క్రీజ్ లోకి వచ్చిన శ్రీకర్ భరత్ దూకుడుగా ఆడాడు. 22 బంతుల్లో 23 పరుగులు చేశాడు. అందులో మూడు ఫోర్లు ఒక సిక్స్ ఉంది. పుజారా (31) విన్నింగ్ షాట్ కోట్టడంతో టీమిండియా 26.4 ఓవర్లకు 118-4 పరుగులు చేసింది. మొదటి టెస్టు తరహాలోనే రెండో టెస్టులోనూ టీమిండియా స్పిన్నర్ల విజృంభణతో ఆసీస్ ను చిత్తుచేసి మూడురోజుల్లో మ్యాచ్ ముగించారు.