Derogatory post on Indian team
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నవంబర్ 19న భారత్, ఆస్ట్రేలియా జట్లు వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచులో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియాను ఓడించిన ఆస్ట్రేలియా ఆరో సారి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ క్రమంలో ఆసీస్ జట్టు పై ఆదేశంలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ ఓ మీడియా సంస్థ మాత్రం భారత క్రికెటర్లను అవమానించే విధంగా ఓ పోస్ట్ చేసింది.
ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్ శతకంతో రాణించాడు. దీంతో ట్రావిస్ హెడ్‌ను హైలెట్ చేస్తూ ఓ ఆసీస్ మీడియా అభ్యంతకరపోస్టు పెట్టింది. సౌత్ ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి 11 మంది భారతీయ కుమారులకు జన్మనిచ్చాడు. ఇది ప్రపంచ రికార్డు అంటూ రాసుకొచ్చింది. అంతేనా.. ట్రావిస్ హెడ్ ఆస్పత్రి బెడ్ పై ఉన్నట్లు.. భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా, షమీ, సిరాజ్ ఇలా 11 మంది ఆటగాళ్లను పిల్లలుగా చూపుతూ వారిని నర్సులు ఎత్తుకుని ఆడిస్తున్నట్లుగా ఓ ఫోటో పోస్టు చేసింది.
Bowler Bizarre Action : విచిత్రమైన బౌలింగ్ యాక్షన్.. అయోమయంలో బ్యాటర్.. ఎక్కడ ఉన్నావ్ బాసూ..!
ఈ పోస్ట్ పై ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ స్పందిస్తూ నాలుగు నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేశాడు. ఆల్‌రౌండర్ గ్లెన్‌మాక్స్‌వెల్, మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ లు పోస్ట్‌ను లైక్ చేశారు. నివేదికల ప్రకారం ఈ పోస్ట్ వైరల్‌గా మారిన తరువాత విమర్శలు రావడంతో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ తన కామెంట్‌ను తొలగించాడు. భారత క్రికెటర్లను అవమాన పరిచేలా ఉన్న ఈ పోస్ట్ పై నెటీజన్లు మండిపడుతున్నారు.
Rohit Sharma : ఐపీఎల్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీకి ఎసరు..? కొత్త కెప్టెన్ అతడేనా..?
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌలైంది. విరాట్ కోహ్లీ (54), కేఎల్ రాహుల్ (66), కెప్టెన్ రోహిత్ శర్మ (47) లు రాణించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీశారు. జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్ చెరో రెండు, మాక్స్‌వెల్, జంపాలు ఒక్కొ వికెట్ తీశారు. అనంతరం ట్రావిస్ హెడ్ (137) శతకం చేయడంతో ఆస్ట్రేలియా 43 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు, మహ్మద్ షమీ, సిరాజ్‌లు ఒక్కొ వికెట్ తీశారు.