WTC Final: బుద్ధి మార్చుకోని ఆసీస్‌.. ఓటమి భయంతో గ్రౌండ్‌లో చెత్త మాటలు.. గట్టి గుణపాఠం చెప్పి సఫారీ జట్టు..

క్రికెట్ లో స్లెడ్జింగ్ పేరు వింటే ఆస్ట్రేలియా జట్టు గుర్తుకొస్తుంది. ఆ జట్టు ప్లేయర్లు క్రీజులోని ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందిపెట్టేలా స్లెడ్జింగ్ కు పాల్పడుతుంటారు.

Australia Sledging

WTC Final: ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ) 2023-25 విజేత‌గా ద‌క్షిణాఫ్రికా నిలిచింది. లండ‌న్‌లోని ప్ర‌ఖ్యాత లార్డ్స్ మైదానంలో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పై సౌతాఫ్రికా ఘ‌న విజ‌యం సాధించింది. ఈ క్ర‌మంలో తొలిసారి డ‌బ్ల్యూటీసీ టైటిల్‌ను ద‌క్షిణాఫ్రికా సొంతం చేసుకుంది. స‌ఫారీ బ్యాట‌ర్ల‌లో ఐడెన్ మార్క్‌క్ర‌మ్ (136), కెప్టెన్ టెంబా బవుమా (66) హాప్ సెంచ‌రీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే, ఓటమి భయంతో ఆస్ట్రేలియా జట్టు సౌతాఫ్రికా బ్యాటర్లపై స్లెడ్జింగ్ కు పాల్పడింది. అయినా సఫారీ బ్యాటర్లు ఆసీస్ కు గట్టి గుణపాఠం చెప్పారు.

 

♦ Also Read: దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమాది చాలా విలాసవంతమైన జీవితం.. ఆయనకు ఎన్నికోట్ల ఆస్తులున్నాయో తెలుసా.. ఖరీదైన కార్లు కూడా..

 

క్రికెట్ లో స్లెడ్జింగ్ పేరు వింటే ఆస్ట్రేలియా జట్టు గుర్తుకొస్తుంది. ఆ జట్టు ప్లేయర్లు క్రీజులోని ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందిపెట్టేలా స్లెడ్జింగ్ కు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనలు అనేకసార్లు వెలుగులోకి వచ్చాయి. తాజాగా.. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లోనూ స్లెడ్జింగ్ ద్వారా సఫారీ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టాలని ఆస్ట్రేలియా ప్లాన్ వేసింది. ఆ మేరకు ప్లేయర్లు ప్రయత్నం కూడా చేశారు. కానీ, సఫారీ బ్యాటర్లు అద్భుత బ్యాటింగ్‌తో ఆసీస్ కు గట్టిగుణపాఠం చెప్పారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో విజయం తరువాత దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా ఆస్ట్రేలియ ప్లేయర్ల స్లెడ్జింగ్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు.

 

ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్ తమపై ఓ దశలో స్లెడ్జింగ్ కు దిగినట్లు బవుమా చెప్పాడు. తమ జట్టు విజయం దిశగా సాగుతున్న నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్లు నోటికి పనిచెప్పినట్లు తెలిపాడు. మ్యాచ్ నాలుగో రోజు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు బవుమా వెల్లడించాడు. నేను, మార్‌క్రమ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ప్రత్యర్థి ఆటగాళ్ల నుంచి చోకర్స్ అనే పదాలు పదేపదే వినిపించాయని తెలిపాడు. అయితే, ఇప్పుడు చోకర్స్ అనే పదం చరిత్రలో కలిసిపోయిందని ఆనందం వ్యక్తం చేశాడు. అయితే, డబ్ల్యూటీసీ ఫైనల్ లాంటి ప్రతిష్టాత్మక పోరులో మళ్లీ ఆస్ట్రేలియా స్లెడ్జింగ్ కు దిగడాన్ని పలువురు క్రికెటర్లు విమర్శిస్తున్నారు.