భార్య చేసిన పనికి.. అత్తింటి ముందే టీ స్టాల్ పెట్టిన అల్లుడు.. చేతికి సంకెళ్లేసుకొని టీ విక్రయం.. స్టాల్‌కు ఏం పేరు పెట్టాడో తెలుసా.. అసలేం జరిగిందంటే..
రాజస్థాన్ కు చెందిన కృష్ణ కుమార్ ధకాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. తన భార్య వేధింపులు తట్టుకోలేక అతను వినూత్ననిరసన చేపట్టాడు.

Krishna Kumar Dhakad
Krishna Kumar Dhakad: తన భార్య చేసిన పనికి భర్త వినూత్న నిరసన చేపట్టాడు. ఏకంగా తన అత్త ఇంటికి ఎదురుగా టీ స్టాల్ ఓపెన్ చేశాడు. చేతికి బేడీలు వేసుకొని ఛాయ్ విక్రయిస్తున్నాడు. ఆ టీ స్టాల్ పేరు కూడా వెరైటీగా పెట్టాడు. దీంతో ఈ న్యూ ఛాయ్‌వాలా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.
రాజస్థాన్ న్యూ చాయ్‌వాలా..
రాజస్థాన్ కు చెందిన కృష్ణ కుమార్ ధకాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. తన భార్య వేధింపులు తట్టుకోలేక అతను వినూత్ననిరసన చేపట్టాడు. కృష్ణ కుమార్ కు 2018 సంవత్సరంలో మీనాక్షి మాళవ్ తో వివాహం జరిగింది. వారిద్దరూ తేనెటీగల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించారు. వారు పెట్టిన వ్యాపారం స్థానిక మహిళలకు సాధికారత కల్పించడంతోపాటు, వారి గుర్తింపును కూడా తెచ్చిపెట్టింది. అయితే, 2022లో కృష్ణకు చెప్పకుండానే అతనికి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్ని నెలల తరువాత ఆమె కృష్ణపై ఐపీసీ సెక్షన్ 498A (కట్నం వేధింపులు), సెక్షన్ 125 కింద కేసు నమోదు చేసింది.
Also Read: Temba Bavuma Wife: టెంబా బావుమా భార్య గురించి ఈ విషయాలు తెలుసా.. ఆమెకు ఏఏ వ్యాపారాలున్నాయి.. వారి వివాహం ఎలా జరిగిందంటే..
మూడేళ్లు కోర్టు చుట్టూనే..
తన భార్య తప్పుడు కేసు పెట్టి నన్ను వేధింపులకు గురిచేస్తుందని కృష్ణ కుమార్ ఆరోపిస్తున్నాడు. తప్పుడు కేసు కారణంగా తన జీవితం నాశనం అయిందని, గత మూడేళ్లుగా నేను న్యాయం కోసం కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. నాకు ఒక వృద్ధ తల్లి ఉంది. ఆమె నాపై ఆధారపడి ఉంది. నేను టిన్ షెడ్ కింద నివసిస్తున్నాను. నా దగ్గర ఏమీ లేదు. చాలాసార్లు నా ప్రాణం తీసుకోవాలని అనుకున్నాను. కానీ, నా తల్లికి నేనే ఏకైక ఆసరా అని కృష్ణ వాపోయాడు.
అందుకే టీ స్టాల్..
కృష్ణ కుమార్ మధ్యప్రదేశ్ రాష్ట్రం నీముచ్‌లోని అథానా గ్రామం నుంచి నుండి దాదాపు 220 కిలో మీటర్లు ప్రయాణించి కోర్టు విచారణ నిమిత్తం అంటాకు వస్తుండేవాడు. కోర్టులో విచారణకు వచ్చిన ప్రతీసారి వాయిదాలు పడుతుండేది. దీంతో విసిగిపోయిన కృష్ణ కుమర్ అంటాలోనే టీ స్టాల్ నడపడం ద్వారా న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన భార్యకు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో భార్య తనపై పెట్టిన కేసుకు నిరసనగా అత్తారింటి ముందు టీ కొట్టును ప్రారంభించాడు. ఆ టీకొట్టుకు వినూత్నమైన పేరు పెట్టాడు. తన భార్య పెట్టిన వరకట్నం వేధింపుల సెక్షన్ 498A పేరుతో.. 498A కేఫ్ అని పెట్టాడు. అంతేకాదు.. భార్య పెట్టిన కేసులో మూడేళ్ల పాటు తాను అనుభవించిన బాధను తెలియజేసేలా చేతులకు బేడీలు వేసుకొని టీ అమ్మడం మొదలు పెట్టాడు. దీంతో కృష్ణ కుమార్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.
पत्नी के झूठे केस से तंग UPSC छात्र ने राजस्थान में शुरू किया ‘498A Tea 🍵Cafe…!!
राजस्थान के बारां जिले के अंता कस्बे में कृष्ण कुमार धाकड़ ने पत्नी द्वारा लगाए गए घरेलू हिंसा और दहेज प्रताड़ना के झूठे केस से तंग आकर एक अनोखा कदम उठाया ।।
केके #UPSC की तैयारी छोड़ अब वह… pic.twitter.com/QblYDvYYlW
— Vinod Bhojak (@VinoBhojak) June 14, 2025
స్టాల్ చుట్టూ బ్యానర్లు..
కృష్ణకుమార్ తన భార్య ప్రవర్తనకు నిరసనగా అత్తంటి ముందే టీస్టాల్ పెట్టడంతోపాటు.. స్టాల్ కు చుట్టూ బ్యానర్లు కట్టాడు. వాటిపై తనకు న్యాయం జరిగే వరకు ఈ టీ మరుగుతూనే ఉంటుంది.. 125 కింద ఎంత ఖర్చు ఇవ్వాల్సి వస్తుందో ఛాయ్ తాగుతూ చర్చించుకుందాం రండి అంటూ.. రాశాడు. భార్య పెట్టిన సెక్షన్ల పేరుతో కృష్ణ పెట్టిన ‘498A టీ కేఫ్’ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతని కథ విన్న నెటిజన్లు తమదైన రీతిలో ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.
కృష్ణ కుమార్ భార్య ఏం చెప్పిదంటే..
కృష్ణ కుమార్ భార్య మీనాక్షి మాళవ్ మాత్రం తన భర్తపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అతను భూమి కొనడానికి నా తండ్రిని డబ్బు అడిగాడు. అందుకు నా తండ్రి నిరాకరించడంతో నన్ను కొట్టాడు. తరువాత నేను నా తండ్రి ఇంటికి తిరిగి వచ్చాను. నేను విడాకులకు సిద్ధంగా ఉన్నాను. కానీ, ముందుగా నా పేరు మీద తీసుకున్న అన్ని రుణాలను తిరిగి చెల్లించాలని ఆమె డిమాండ్ చేసింది.