Temba Bavuma Wife: దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా భార్య గురించి ఈ విషయాలు తెలుసా.. ఆమెకు ఏఏ వ్యాపారాలున్నాయి.. వారి వివాహం ఎలా జరిగిందంటే..
టెంబా బావుమా భార్య పేరు ఫిలా లోబీ. 2018 సంవత్సరంలో బావుమా, ఫిలా లోబీ పెండ్లి చేసుకున్నారు.

Temba Bavuma and his Wife Phila Lobi
Temba Bavuma Wife: టెంబా బావుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు శనివారం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ -2025 టైటిల్‌ను గెలుచుకుంది. లండన్ లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన డబ్ల్యూపీఎల్ ఫైనల్లో నాల్గోరోజు ఆటలో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. రెండో ఇన్నింగ్స్ లో ఐడెన్ మార్క్రమ్ సెంచరీ చేయగా.. బావుమా అర్ధ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక భూమిక పోషించారు. ఈ విజయం తరువాత బావుమా పేరు మారుమోగిపోతుంది. దీంతో అతని జీవితం గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఆతని భార్య ఆస్తులు, ఆమె చేస్తున్న వ్యాపారాలు గురించి తెలుసుకొని ఆకింత ఆశ్యర్యపోతున్నారు.
టెంబా బావుమా భార్య పేరు ఫిలా లోబీ. 2018 సంవత్సరంలో బావుమా, ఫిలా లోబీ పెండ్లి చేసుకున్నారు. వెస్ట్రన్ కేప్ ప్రావిన్స్‌లోని ఫ్రాన్‌షోక్‌లో వీరి వివాహం జరిగింది. వారి సన్నిహితులు, జట్టు ఆటగాళ్ళు కూడా వీరి వివాహానికి హాజరయ్యారు. అయితే, అంతకుముందు వీరిద్దరూ నాలుగేళ్లు డేటింగ్ లో ఉన్నారు. ఈ జంటకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. లార్డ్స్‌లో చారిత్రక విజయం తరువాత టెస్ట్ గదను పట్టుకొని తన కుమారుడిని ఎత్తుకొని మైదానంలో కలియతిరుగుతూ బావుమా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
View this post on Instagram
టెంబా బావుమా భార్య ఫిలో లోబీ విజయవంతమైన వ్యాపారవేత్త. ఆమె సంపాదనపరంగా భర్తకు గట్టి పోటీని ఇస్తుంది. ఫిలాకు రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ పేరు లోబీ ప్రాపర్టీస్. ఆమె దీనిని 2016 సంవత్సంరలో ప్రారంభించింది. ఈ కంపెనీ జోహన్నెస్‌బర్గ్, కేప్ టౌన్‌లలో లగ్జరీ ఆస్తులను విక్రయాలు చేస్తుంది. ఫిలా కూడా ఒక సామాజిక కార్యకర్త. 2018 సంవత్సరంలో ఆమె ఫిలా లోబీ ఫౌండేషన్ ను స్థాపించింది. ఈ సంస్థ పేద, అనాథ పిల్లలకు ఆశ్రయం ఇస్తూ వారికి అండగా నిలుస్తుంది. ఫిలా లోబీ చదువులో కూడా టాపర్. ఆమె ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ లో పట్టభద్రురాలైంది.