దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమాది చాలా విలాసవంతమైన జీవితం.. ఆయనకు ఎన్నికోట్ల ఆస్తులున్నాయో తెలుసా.. ఖరీదైన కార్లు కూడా..
టెంబా బావుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు శనివారం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ -2025 టైటిల్‌ను గెలుచుకుంది.

Temba Bavuma Net Worth
Temba Bavuma Net Worth: టెంబా బావుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు శనివారం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ -2025 టైటిల్‌ను గెలుచుకుంది. లండన్ లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన డబ్ల్యూపీఎల్ ఫైనల్లో నాల్గోరోజు ఆటలో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. నాల్గో ఇన్నింగ్స్ లో ఐడెన్ మార్క్రమ్ సెంచరీ చేయగా.. బావుమా అర్ధ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక భూమిక పోషించారు.
తాజా విజయంతో దక్షిణాఫ్రికా జట్టు 27 సంవత్సరాల తరువాత ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. 1998లో జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించిన తరువాత కెప్టెన్ టెంబా బావుమాపై మాజీ క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కానీ, రెండేళ్ల ముందు అతను తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.
బావుమాకు కేవలం కోటా విధానం వల్లే అవకాశం దక్కిందని.. ఆటగాడిగా కూడా జట్టులో ఉండడానికి అర్హత లేని అతనికి కెప్టెన్‌గా ఎలా కొనసాగిస్తారనే ప్రశ్నలు తలెత్తాయి. బావుమా వైఫల్యం వల్ల జట్టు సమతూకమే దెబ్బ తింటోందనే చర్చ జరిగింది. అయితే, ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించడం, ఆ విజయంలో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా బావుమా అదరగొట్టడంతో క్రీడాభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో.. బావుమా ఆస్తుల విలువ ఎంత.. అసలు అతను ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నారనే విషయాన్ని తెలుసుకుందాం.
బావుమా కోట్ల విలువైన ఆస్తికి యజమాని..
బావుమా చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. కేప్‌టౌన్‌లోని లంగా ఇరుకైన వీధుల నుండి లార్డ్స్ మైదానం వరకు ప్రయాణించిన అతని మొత్తం సంపాదన దాదాపు రూ.40కోట్లు ఉంటుందని సమాచారం. బావుమా ఐపీఎల్ ఆడలేదు. కాబట్టి అతని సంపాదనలో ఎక్కువ భాగం మ్యాచ్ ఫీజులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల నుండి వస్తుంది. అతనికి క్రికెట్ సౌతాఫ్రికా నుండి వార్షిక రుసుము రూ.80లక్షలు అందుకుంటున్నాడు. ఇదిమాత్రమే కాదు.. అతను ఒక టెస్ట్ మ్యాచ్ కు రూ.3.60లక్షలు, వన్డేకు రూ.96వేలు, టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ కు రూ.64వేలు పొందుతాడు. అతను స్పోర్ట్స్ ఫుట్‌వేర్ బ్రాండ్ న్యూ బ్యాలెన్స్ తో సంబంధం కలిగి ఉన్నాడు.
బావుమా వద్ద ఎన్ని కార్లు ఉన్నాయనే వివరాలను పరిశీలిస్తే.. అతని వద్ద ఉన్న కార్లలో ఆడి టిటి స్పోర్ట్స్, మెర్సిడెస్, ఫోర్ట్ ముస్తాంగ్ జీటీ వంటి అనేక వాహనాలు ఉన్నాయి. టెంబా బావుమా ఖులనాథి ప్రాపర్టీ గ్రూప్ కు నాన్- ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్. ఇది మాత్రమే కాదు.. అతను రియల్ ఎస్టేట్ లో కూడా పెట్టుబడి పెట్టాడు. అతని భార్య పేరు ఫిలా లోబి. వీరు 2018 ఆగస్టు 25న వివాహం చేసుకున్నారు.
Congratulations Themba Bavuma on your wedding👰👫💍
You can’t stay away from your whites, even on your wedding day😂 pic.twitter.com/DRiLrscvJ2
— Blacks in Whites (@BlaqsInCricket) August 25, 2018
View this post on Instagram