డబ్ల్యూటీసీ ఫైనల్లో విజయంపై దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా ఆసక్తికర కామెంట్స్.. ఆ కారణం వల్లే ఆసీస్‌పై గెలిచాం..

ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ) 2023-25 ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పై ద‌క్షిణాఫ్రికా విజ‌యం సాధించింది.

డబ్ల్యూటీసీ ఫైనల్లో విజయంపై దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా ఆసక్తికర కామెంట్స్.. ఆ కారణం వల్లే ఆసీస్‌పై గెలిచాం..

Temba Bavuma

Updated On : June 15, 2025 / 7:45 AM IST

WTC Final: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా జట్టు అద్భుత విజయం సాధించింది. గెలుపు ముంగిట తడబడకుండా, పోరాటం ఆపకుండా, ఒత్తిడికి లోనుకాకుండా.. స్ఫూర్తిదాయక ఆటతో డబ్ల్యూటీసీ టైటిల్ ను గెలుచుకుంది. తద్వారా చోకర్స్ కాదు.. మేము ఛాంపియన్స్ అని సఫారీ జట్టు నిరూపించింది. 27ఏళ్ల తరువాత ఐసీసీ ట్రోఫీ కైవసం చేసుకోవటంతో దక్షిణాఫ్రికా క్రికెటర్లు, ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటాయి.

Also Read: ఓర్నీ.. ఇదేం క్రికెట్ సామీ..! అశ్విన్ భయ్యా మీవాళ్లు ఆడేది క్రికెట్టా.. ఇంకేదైనా గేమా..? వీడియో చూస్తే పడిపడి నవ్వడం ఖాయం..

డబ్ల్యూటీసీ ఫైనల్లో అద్భుత ఆటతీరుతో టైటిల్‌ను గెలిచిన తరువాత దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. ‘మేం డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాం. మమ్మల్ని కొందరు సందేహించారు. ఆ సందేహాలను పటాపంచలు చేశాం. మేమెంతో కష్టపడ్డాం. చాలా నమ్మకంతో ఫైనల్లో ఆడాం. మా సామర్థ్యంపై చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. బాగా ఆడినందుకు సంతోషంగా ఉంది. విజయానికి మేం అర్హులం. నా సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను. మాకు మద్దతు తెలిపిన వాళ్లందరికీ కృతజ్ఞతలు’ అంటూ ఒవుమా అన్నారు.


ద‌క్షిణాఫ్రికాకు ప్రైజ్‌మ‌నీగా 30 కోట్ల‌కు పైనే..
ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ) 2023-25 ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పై ద‌క్షిణాఫ్రికా విజ‌యం సాధించింది. ఈ క్ర‌మంలో ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ గ‌ద‌ను సొంతం చేసుకుంది. తొలిసారి డ‌బ్ల్యూటీసీ విజేత‌గా నిలిచిన‌ స‌ఫారీలు టెస్టు ఛాంపియ‌న్ షిప్ గ‌దతో పాటు ప్రైజ్‌మ‌నీ కింద రూ.30.78 కోట్లు న‌గ‌దును సొంతం చేసుకున్నారు. ఇక ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన ఆస్ట్రేలియాకు రూ.18.6 కోట్లు ద‌క్కాయి.