ఇండియా గెలవాలంటే 309 రన్స్ చేయాలి, ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 312/6 డిక్లేర్డ్

Australia set 407 run victory target for India : ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో 98 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. క్రీజులో పుజారా 09, రహానే 04 పరుగులతో క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ 52, శుభ్ మన్ గిల్ 31 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 338 పరుగులు చేయగా..భారత్ తొలి ఇన్నింగ్స్ లో 244 రన్లు చేసింది.

భారత్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో భారత్‌ ముందు ఆస్ట్రేలియా భారీ టార్గెట్‌ పెట్టింది. 312 స్కోర్‌ వద్ద రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేసింది. దీంతో సిడ్నీ టెస్టులో ఇండియా గెలవాలంటే నాలుగో ఇన్నింగ్స్‌లో భారత 407 పరుగులు ఛేదించాల్సి ఉంది. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్ కామెరూన్ గ్రీన్ 132 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 132 పరుగులు చేయగా.. స్టీవ్ స్మిత్ 167 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 81 పరుగులు చేశాడు. లబుషేన్ 73 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ టిమ్ పైన్ 52 బంతుల్లో 6 ఫోర్లతో 39 పరుగులు చేశాడు.

భారత బౌలర్లలో అశ్విన్, సైనీలకు రెండేసి వికెట్లు దక్కగా, బుమ్రా, సిరాజ్ చెరో వికెట్ తీశారు. ఫీల్డింగ్‌లో భారత ప్లేయర్లు ఈజీ క్యాచ్‌లను జారవిడిచారు. లబుషేన్ ఇచ్చిన క్యాచ్‌ను హనుమ విహారి డ్రాప్ చేయగా… కామెరూన్ గ్రీన్ ఇచ్చిన క్యాచ్‌ను రోహిత్ శర్మ నేలపాలు చేశాడు. భారత్ ముందు భారీ లక్ష్యం ఉండటంతో డ్రా చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. నాలుగో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాపై భారత జట్టు చేసిన అత్యధిక పరుగుల చేధన 230 పరుగులు మాత్రమే. అది కూడా 2003లో. ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకోవాలన్నా భారత జట్టు 135 ఓవర్ల పాటు ఆలౌట్ కాకుండా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.