×
Ad

Australia Women vs India Women : టీమిండియాకు బిగ్‌షాక్.. ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం

Australia Women vs India Women : టీమిండియా మహిళా జట్టుకు ఆస్ట్రేలియా మహిళా జట్టు బిగ్ షాకిచ్చింది. ఏకైన పింక్ బాల్ టెస్ట్‌ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది.

Australia Women vs India Women Test Match: Australia beats India by 10 wickets

  • ఆస్ట్రేలియా చేతిలో భారత్‌ ఘోర పరాజయం
  • 10వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం
  • మూడో రోజు తొలి సెషన్‌లోనే ముగిసిన మ్యాచ్

Australia Women vs India Women : టీమిండియా మహిళా జట్టుకు ఆస్ట్రేలియా మహిళా జట్టు బిగ్ షాకిచ్చింది. 10 వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. పెర్త్‌లోని వాకా స్టేడియంలో జరుగుతున్న ఏకైక పింక్ బాల్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది.

Also Read : T20 world Cup Final : ఫైనల్ పోరుకు భారత్ రెడీ.. తుది జట్టు నుంచి ఆ ఇద్దరు ఔట్.. విధ్వంసకర బ్యాటర్‌కు ఎంట్రీ.. గంభీర్ కీలక నిర్ణయం..

ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 323 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు 125 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత బ్యాటర్లు పరుగుల రాబట్టడంలో విఫలమయ్యారు. దీంతో 149 పరుగులకే భారత జట్టు ఆలౌట్ అయింది. ప్రతీకా రావల్ (63), స్నేహా రాణా (30) రాణించారు. మిగిలిన బ్యాటర్లు స్మృతి మంధాన (2), షెఫాలీ వర్మ (5), జెమీ రోడ్రిగ్స్ (14), హర్మన్ ప్రీత్ కౌర్ (11), దీప్తి శర్మ (9), రిచా ఘోష్ (0), కాశ్వీ గౌతమ్ (0) అందరూ పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు.

ఆస్ట్రేలియా 25 పరుగుల లక్ష్య చేధనకు బ్యాటింగ్‌ను ప్రారంభించింది. కేవలం 4.3 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోకుండా 28 పరుగుల చేసి విజయం సాధించింది. ఓపెనర్లు జార్జియా 16, లిచ్‌ఫీల్డ్ 11 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఈ మ్యాచ్‌ మూడో రోజు తొలి సెషన్‌లోనే ముగిసింది.

ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా భారత జట్టు మూడు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌లు, ఒక టెస్టు మ్యాచ్ ఆడింది. తొలుత టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్‌.. ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్‌లో క్వీన్‌‌స్వీప్‌ అయ్యింది. ఇప్పుడు టెస్ట్‌ మ్యాచ్‌లో కూడా ఓడి, సిరీస్‌ మొత్తాన్ని కోల్పోయింది.