రోహన్‌ బోపన్న సరికొత్త చరిత్ర.. లేటు వయసులో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్

అందరూ ఊహించినట్టుగానే అద్భుతం చేశాడు ఇండియా టెన్నిస్ స్టార్ రోహన్‌ బోపన్న. లేటు వయసులో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్ సాధించి సరికొత్త చరిత్ర లిఖించాడు.

Rohan Bopanna Creates History Becomes Oldest Ever Man To Win Grand Slam

Rohan Bopanna: ఇండియా టెన్నిస్ స్టార్ రోహన్‌ బోపన్న సరికొత్త చరిత్ర లిఖించాడు. 43 ఏళ్ల లేటు వయసులో డబుల్స్‌లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్ సాధించి రికార్డు సృష్టించాడు. మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా)తో కలిసి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల డబుల్ టైటిల్ సాధించాడు. శనివారం జరిగిన ఫైనల్లో ఇటలీ జోడీ సైమన్‌ బోలెల్లీ-ఆండ్రియా వవస్సోరిపై బోపన్న-ఎబ్డెన్‌ జంట వరుస సెట్లతో విజయం సాధించింది. 7-6, 7-5తో ప్రత్యర్థిని మట్టి కరిపించి కెరీర్ లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫస్ట్ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్ అందుకున్నాడు రోహన్‌ బోపన్న.

తుది పోరులో బోలెల్లీ-ఆండ్రియా నుంచి తీవ్ర పోటీ ఎదురైనా వీరోచితంగా పోరాడి టైటిల్ గెలిచాడు. తొలి సెట్ గెలిచిన తర్వాత బోలెల్లీ-ఆండ్రియా జోడీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. రెండు జోడీలు హోరాహోరీగా తలపడ్డాయి. ఒక దశలో 3-4తో బోపన్న-ఎబ్డెన్‌ జంట వెనుకబడినప్పటికీ పట్టుదలతో పుంజుకుని రెండో సెట్ లోనే 7-5తో ఆటను ముగించారు.

Also Read: హైదరాబాద్ బ్యాటర్ ఊచకోత.. 39 ఏళ్ల రవిశాస్త్రి రికార్డ్ బ్రేక్.. ఏకంగా ప్రపంచ రికార్డు నెలకొల్పిన యువ క్రికెటర్

లేటు వయసులో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్ సాధించి రికార్డు సృష్టించిన రోహన్‌ బోపన్నకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అతడిని అభినందిస్తూ సెలబ్రిటీలు ట్వీట్లు చేస్తున్నారు.