DC vs LSG : ల‌క్నో పై ఢిల్లీ సంచ‌ల‌న విజ‌యం.. కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ కామెంట్స్‌.. ‘నా కెప్టెన్సీలో..’

ల‌క్నో పై సంచ‌ల‌న విజ‌యం సాధించిన త‌రువాత ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి.

Courtesy BCCI

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ శుభారంభం చేసింది. విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఒక్క వికెట్ తేడాతో సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. 210 ప‌రుగుల భారీ లక్ష్య ఛేద‌న‌లో ఓ ద‌శ‌లో 7 ఓవ‌ర్ల‌లో 66 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డిన ఢిల్లీ జ‌ట్టు అసామాన్య ఆట తీరును ప్ర‌ద‌ర్శించింది.

అశుతోష్ శ‌ర్మ (66 నాటౌట్; 31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), విప్ర‌జ్ నిగ‌మ్ (39; 15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ (34; 22 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స‌ర్లు) సంచ‌ల‌న బ్యాటింగ్‌తో ఢిల్లీ జ‌ట్టు 19.3 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి మ‌రుపురాని విజ‌యాన్ని అందుకుంది. కాగా.. ఈ అద్భుత విజ‌యం పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ స్పందించాడు.

DC vs LSG : ఈజీగా గెలిచే మ్యాచ్‌లో ఓడిపోవ‌డం పై స్పందించిన రిష‌బ్ పంత్..

ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డం చాలా బాగుంద‌న్నాడు. తాను తీసుకున్న కొన్ని నిర్ణ‌యాలు హెచ్చుత‌గ్గుల‌తో కూడి ఉంటాయ‌ని, వాటికి అల‌వాటు ప‌డాల‌ని ఫ్యాన్స్‌కు సూచించాడు. ఇప్పుడు మ్యాచ్ గెలిచాం కాబ‌ట్టి ఎవ్వ‌రూ ఏమీ అన‌రు అని అన్నాడు. ముఖ్యంగా స్ట‌బ్స్‌కు బౌలింగ్ ఎందుకు ఇచ్చావ‌ని అడుగ‌ర‌ని అన్నాడు.

ఇలాంటి మ్యాచ్‌ను తాను ఎప్పుడు చూశానో త‌న‌కు గుర్తు లేద‌న్నాడు. ప‌వర్ ప్లేలో నాలుగు వికెట్లు కోల్పోయిన త‌రువాత మ్యాచ్ గెల‌వ‌డం ఓ అద్భుతం అన్నాడు. ప్ర‌స్తుతం క్రికెట్‌లో చాలా మార్పులు జ‌రుగుతున్నాయి. ఒక్క‌రు క్రీజులో ఉన్నా చాలు.. ఓ బౌల‌ర్‌గా ఇదంతా మైండ్ గేమ్ అని భావిస్తున్న‌ట్లు చెప్పాడు.

CSK vs MI : CSK కి వెన్నుపోటు.. సొంత బ్రదర్ దీపక్ చాహర్ మీద సోదరి సంచలనం.. కట్టప్ప పోస్టర్ పెట్టి..

ఇక ల‌క్నో బ్యాటింగ్ తీరు ఆరంభ‌మైన తీరు గ‌మ‌నిస్తే.. మేము ప‌వ‌ర్ ప్లేలో చాలా ఎక్కువ ప‌రుగులు ఇచ్చాము. అయితే.. ఆఖ‌రి ఏడు ఓవ‌ర్ల‌లో వారిని క‌ట్ట‌డి చేశాము. వారి ప్రారంభం చూస్తే 240కి పైగా ప‌రుగులు చేస్తార‌ని అనిపించింది. అయితే.. మేము 210లోపే క‌ట్ట‌డి చేయ‌గ‌లిగాము. ఒత్తిడిలో కూడా ఎంతో చ‌క్క‌గా విప్ర‌జ్ నిగ‌మ్ ఆడాడు. ఈ క్రెడిట్ అత‌డికే ద‌క్కుతుంది. అత‌డి సామ‌ర్థ్యం ఏంటో మాకు తెలుసు అని అక్ష‌ర్ ప‌టేల్ అన్నాడు.