Courtesy BCCI
కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 సీజన్‌లో దూసుకుపోతుంది. ఈ సీజన్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో లక్నో మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ (44; 30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆయుష్ బదోని (41; 33 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) లు రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా, యాన్సెన్, చాహల్, మాక్స్‌వెల్, ఫెర్గూసన్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
Ashwani Kumar : అప్పుడు ఆటో కోసం రూ.30 అడిగేవాడు.. ఇప్పుడు ఏకంగా రూ.30లక్షలు..
అనంతరం ప్రభ్‌సిమ్రన్ సింగ్ (69; 34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (52 నాటౌట్; 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు), నేహాల్ వధేరా (43 నాటౌట్; 25 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో లక్ష్యాన్ని పంజాబ్ 16.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అందుకుంది.
బదోని, బిష్ణోయ్ ఫీల్డింగ్ విన్యాసం..
ఈ మ్యాచ్‌లో లక్నో ఆటగాళ్లు రవి బిష్ణోయ్, ఆయుష్ బదోని లు అద్భుత పీల్డింగ్ విన్యాసంతో ఆకట్టుకున్నారు. పంజాబ్ ఇన్నింగ్స్ 11 ఓవర్‌లో ఇది చోటు చేసుకుంది. లక్నో బౌలర్ దిగ్వేశ్ ఈ ఓవర్‌ను వేశాడు. పంజాబ్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ భారీ షాట్ కొట్టాడు.
BCCI : కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్‌లకు శుభవార్త చెప్పనున్న బీసీసీఐ..
Rohit Sharma : రోహిత్ శర్మ సిక్స్ కొడితే.. సౌండ్ అదిరిపోద్ది..
గాల్లోకి లేచిన బంతి దాదాపుగా బౌండరీ లైన్ దాటుతుండగా.. బౌండరీ లైన్ వద్ద ఉన్న బదోని బాల్‌ను పట్టుకుని గాల్లోకి ఎగిరి మైదానంలోకి విసిరివేశాడు. అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన బిష్ణోయ్.. బదోని విసిరిన బాల్ ముందుకు డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఆటగాళ్లతో పాటు మైదానంలోని ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే ది బెస్ట్ క్యాచ్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.