Rohit Sharma : రోహిత్ శర్మ సిక్స్ కొడితే.. సౌండ్ అదిరిపోద్ది..
ఐపీఎల్ 2025లో సీజన్‌లో రోహిత్ శర్మ తొలి సిక్స్ కొట్టిన వెంటనే..

Courtesy BCCI
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్‌లో ముంబైకి ఏకంగా ఐదు టైటిళ్లను అందించాడు. అయితే.. ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు అతడిని ముంబై కెప్టెన్సీ బాధ్యతల నుంచి జట్టు మేనేజ్‌మెంట్ తప్పించింది. దీంతో ప్రస్తుతం అతడు బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకుంది. సోమవారం వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ మొదట బ్యాటింగ్ చేసింది. 16.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. కేకేఆర్ బ్యాటర్లలో అంగ్క్రిష్ రఘువంశీ (26), రమణ్‌దీప్ సింగ్ (22), మనీష్ పాండే (19), రింకూ సింగ్ (17) లు ఫర్వాలేదనిపించగా.. క్వింటన్ డికాక్ (1), సునీల్ నరైన్ (0), అజింక్యా రహానే (11), వెంకటేశ్ అయ్యర్ (3)లు విఫలం అయ్యారు. ముంబై బౌలర్లలో అశ్వని కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్ రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, విష్నేష్ పుతూర్, మిచెల్ సాంట్నర్ లు తలా ఓ వికెట్ సాధించారు.
Suryakumar Yadav : టీ20ల్లో చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్..
ఆ తరువాత ర్యాన్ రికెల్టన్ (62 నాటౌట్; 41 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (27 నాటౌట్; 9 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టడంతో లక్ష్యాన్ని ముంబై 12.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రసెల్ రెండు వికెట్లు తీశాడు.
హిట్‌మ్యాన్ సిక్స్ కొడితే..
ఈ ఐపీఎల్ సీజన్‌లో రోహిత్ శర్మ తన పేలవ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. కేకేఆర్ మ్యాచ్‌లో 12 బంతులు ఆడిన హిట్‌మ్యాన్ ఓ సిక్స్ సాయంతో 13 పరుగులు చేశాడు. కాగా.. ఐపీఎల్ 2025 సీజన్‌లో రోహిత్ శర్మకు ఇదే తొలి సిక్స్ కావడం గమనార్హం.
IPL 2025 : వామ్మో కాస్ట్‌లీ ప్లేయర్.. సింగిల్ రన్‌కు రూ.2.7 కోట్లు..
🚨 LOUDEST OF THE SEASON 🚨
– 129 db when Rohit Sharma hit the first six of his season 🤯🔥 pic.twitter.com/wwTg79ZaYZ
— Johns. (@CricCrazyJohns) April 1, 2025
ఇక రోహిత్ శర్మ తొలి సిక్స్ కొట్టిన వెంటనే అభిమానులు ఈలల, గోలలతో చేసిన సౌండ్‌తో వాంఖడే స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. 129 డెసిబెల్స్ సౌండ్ నమోదైంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటి వరకు ఈ స్థాయిలో ప్రేక్షకులు సౌండ్ చేయలేదు.
MI vs KKR : మేం చేసిన పొరబాటు అదే.. ముంబై చేతిలో ఓటమి తరువాత కోల్‌కతా కెప్టెన్ రహానే కామెంట్స్..
హిట్‌మ్యాన్ క్రేజా మజాకానా అని రోహిత్ శర్మ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.