IPL 2025 : వామ్మో కాస్ట్‌లీ ప్లేయ‌ర్‌.. సింగిల్ ర‌న్‌కు రూ.2.7 కోట్లు..

ఐపీఎల్ 2025లో విఫ‌లం అవుతున్న వెంక‌టేష్ అయ్య‌ర్ పై ఆ జ‌ట్టు అభిమానులే తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

IPL 2025 : వామ్మో కాస్ట్‌లీ ప్లేయ‌ర్‌.. సింగిల్ ర‌న్‌కు రూ.2.7 కోట్లు..

Courtesy BCCI

Updated On : April 1, 2025 / 10:56 AM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ రెండో ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. ముంబై వేదిక‌గా సోమ‌వారం ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్‌ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో కోల్‌క‌తా మొదట బ్యాటింగ్ చేసింది. 16.2 ఓవ‌ర్ల‌లో 116 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అనంత‌రం ల‌క్ష్యాన్ని ముంబై 12.5 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి అందుకుంది.

బ్యాటింగ్‌లో స‌మిష్టి వైఫ‌ల్యం చెందిన కేకేఆర్ బ్యాట‌ర్ల‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. రూ.23.75 కోట్ల భారీ మొత్తం చెల్లించి తీసుకున్న వైస్ కెప్టెన్ వెంక‌టేష్ అయ్య‌ర్‌ను సొంత అభిమానులే టార్గెట్ చేస్తున్నారు. ముంబైతో మ్యాచ్‌లో 9 బంతుల్లో 3 ప‌రుగులు మాత్ర‌మే చేసి తీవ్రంగా నిరాశ‌ప‌రిచాడు. ఆదుకోవాల్సిన టైమ్‌లో ఔట్ అయి జ‌ట్టును మ‌రింత క‌ష్టాల్లోకి నెట్టాడు

MI vs KKR : మేం చేసిన పొరబాటు అదే.. ముంబై చేతిలో ఓట‌మి త‌రువాత కోల్‌క‌తా కెప్టెన్ ర‌హానే కామెంట్స్..

మూడు మ్యాచ్‌ల్లో 9 ప‌రుగులు..

ఈ ఐపీఎల్ 2025 ఆర్‌సీబీతో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో 6 ర‌న్స్ చేశాడు వెంక‌టేష్ అయ్యార్‌. రాజ‌స్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవ‌కాశం రాలేదు. ఇక ముంబైతో మ్యాచ్‌లో 3 ప‌రుగులే చేశాడు. మొత్తంగా ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 9 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఆల్‌రౌండ‌ర్ అయిన అయ్య‌ర్‌.. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క బంతిని కూడా వేయ‌లేదు.

దీంతో అయ్య‌ర్ జ‌ట్టుకు భారంగా మారాడాని, ఫ్రాంచైజీ న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేస్తున్నాడ‌ని కామెంట్లు చేస్తున్నారు. త‌న‌కు కెప్టెన్సీ కాకుండా వైస్ కెప్టెన్సీ ఇవ్వ‌డంతోనే వెంక‌టేష్ ఆడ‌డం లేద‌ని ఇంకొంద‌రు మండిప‌డుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అయ్య‌ర్ చేసిన ప‌రుగుల‌ను, అత‌డిని ద‌క్కిన మొత్తంతో లెక్కిస్తే.. అత‌డు ప‌రుగుకు దాదాపుగా రూ.2.7కోట్లు చొప్పున అవుతుంద‌ని దుయ్య బ‌ట్టారు.

MI vs KKR : ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో తొలి విజ‌యం.. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఏమ‌న్నాడో తెలుసా?