Uppal Stadium
హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియంలోని నార్త్ స్టాండ్ పెవిలియన్ నుంచి మహ్మద్ అజారుద్దీన్ పేరును తొలగించాలని హెచ్‌సీఏకి అంబుడ్స్‌మన్ జస్జిస్ ఈశ్వరయ్య ఆదేశించారు. దీంతో ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్ కు అజారుద్దీన్ పేరును తొలగించనున్నారు.
లార్డ్స్ క్రికెట్ క్లబ్ వేసిన పిటిషన్ పై అంబుడ్స్‌మన్ విచారణ జరిపి ఈ ఆదేశాలు జారీ చేశారు. హెచ్‌ఏసీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అజారుద్దీన్ తన పేరు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నారని, దీంతో ఈ నిర్ణయం చెల్లదని అంబుడ్స్‌మన్ స్పష్టం చేశారు.
ఈ నిర్ణయంలో విరుద్ధ ప్రయోజనాలున్నాయని అంబుడ్స్‌మన్ తీర్పు ఇచ్చారు. వెంటనే నార్త్ స్టాండ్ కు అజారుద్దీన్ పేరు తొలగించాలని హెచ్‌సీఏను ఆదేశించారు. టికెట్లపై ఇకనుంచి ఆ పేరు ప్రస్థావన ఉండొద్దని తేల్చిచెప్పారు. హెచ్‌సీఏ చుట్టూ చాలా కాలంగా ఎన్నో రకాలా వివాదాలు చెలరేగుతున్నాయి. హెచ్‌సీఏ తీసుకున్న అనేక నిర్ణయాలపై గతంలో విమర్శలు కూడా వచ్చాయి.
Also Read: ట్రంప్, మస్క్ మధ్య చిచ్చు.. ఆ మీటింగ్‌లకు ఎలాన్ మస్క్‌కి నో ఎంట్రీ..?