ట్రంప్, మస్క్ మధ్య చిచ్చు.. ఆ మీటింగ్‌లకు ఎలాన్‌ మస్క్‌కి నో ఎంట్రీ..?

ఇప్పుడు మాత్రం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విదేశాంగ విధాన అంశాల నుంచి మస్క్‌ను దూరంగా ఉంచుతున్నారు.

ట్రంప్, మస్క్ మధ్య చిచ్చు.. ఆ మీటింగ్‌లకు ఎలాన్‌ మస్క్‌కి నో ఎంట్రీ..?

Donald Trump and Elon Musk

Updated On : April 19, 2025 / 4:10 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ మధ్య చిచ్చురేగినట్లు తెలుస్తోంది. చైనాకు సంబంధించిన చర్చల్లో పాల్గొనకుండా ఎలాన్‌ మస్క్‌పై ట్రంప్‌ నిషేధం విధించారని ప్రచారం జరుగుతోంది.

గత నెలలో ఎలాన్ మస్క్ అమెరికా సైనిక విషయాల గురించి పెంటగాన్ నుంచి చాలా ముఖ్యమైన అప్‌డేట్‌ను అందుకోవాల్సి ఉండగా, ఆయనకు ఆ సమాచారం అందలేదు. అప్పటి నుంచి సమస్య మొదలైంది.

న్యూయార్క్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. పెంటగాన్‌తో ఎలాన్‌ మస్క్‌ పాల్గొన్న ఆ సమావేశంలో చైనాపై అమెరికా సైనిక చర్యల గురించి చర్చించాల్సి ఉంది. అయితే, చైనాలో ఎలాన్‌ మస్క్‌కు అనేక రకాల వ్యాపారాలు ఉన్నాయి.

దీంతో అదే చైనాపై అమెరికా సైనిక చర్యల గురించి జరిగే చర్చల్లో ఎలాన్ మస్క్‌ ఎలా పాల్గొంటారన్న వాదనలు వినపడ్డాయి. దీంతో ట్రంప్‌ ఆ సమయంలో స్పందిస్తూ.. ఆ సమావేశం అజెండాలో అసలు చైనా గురించి చర్చే లేదని చెప్పారు.

Also Read: ఇంటిని ఖాళీ చేస్తా.. తాళం చెవిని ఈ మంత్రి తాలూకా వ్యక్తులకు 5 రోజుల్లో ఇస్తా: లావణ్య 

పెంటగాన్‌తో ఎలాన్‌ మస్క్‌ సమావేశంలో పాల్గొన్నప్పటికీ చైనా గురించి చర్చించలేదని, టెక్నాలజీ వంటి ఇతర విషయాల గురించి చర్చించారని అమెరికా అధికారులు క్లారిటీ ఇచ్చారు. చైనాలో ఎలాన్‌ మస్క్‌కు ఉన్న వ్యాపారాల కారణంగా ఆ దేశం గురించి జరిగే సున్నితమైన చర్చల్లో ఎలాన్‌ మస్క్‌ పాల్గొనకుండా ట్రంప్‌ చేస్తున్నారని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. చైనాతో మస్క్ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందన్న వాదనలు జరిగాయని తెలిపింది.

“మిలటరీ ప్రణాళికలను వ్యాపారవేత్తకు చెప్పకూడదు” అని ట్రంప్‌ ఇటీవలే మీడియాకు చెప్పారు. మొదట ఎలాన్‌ మస్క్‌ను అమెరికా ప్రభుత్వం బాగానే నమ్మింది. మస్క్‌కు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియెన్సీ (డోజ్) బాధ్యతలను కూడా అప్పగించింది.

ఇప్పుడు మాత్రం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విదేశాంగ విధాన అంశాల నుంచి మస్క్‌ను దూరంగా ఉంచుతున్నారు. చైనాతో వ్యాపార ప్రయోజనాల కోసం మస్క్‌ తనకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండడంతో ట్రంప్ ఈ పనిచేస్తున్నారని తెలుస్తోంది.