×
Ad

HCA Apex Council : అపెక్స్ కౌన్సిల్‌‌పై అజారుద్దీన్ ఫైర్, కౌన్సిల్‌‌లో కొనసాగుతా

తనను అధ్యక్షుడిగా జనరల్ బాడీ ఎన్నుకుందని, HCA గౌరవానికి ఎప్పుడూ భంగం కలిగించలేదని అజారుద్దీన్ వెల్లడించారు. హెచ్ సీఏ రాజ్యాంగాన్ని ఆ ఐదుగురు ఖూనీ చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.

  • Published On : June 17, 2021 / 01:35 PM IST

Azharuddin Reacts Hca Apex Council Notice

HCA Apex Council Notice : అపెక్స్ కౌన్సిల్ కొనసాగుతానని, తనపై చర్యలు తీసుకొనే అధికారం కౌన్సిల్ కు లేదని అజారుద్దీన్ వెల్లడించారు. హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌ను తొలగిస్తూ అపెక్స్‌ కౌన్సిల్‌ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై 2021, జూన్ 17వ తేదీ గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

తనను అధ్యక్షుడిగా జనరల్ బాడీ ఎన్నుకుందని, HCA గౌరవానికి ఎప్పుడూ భంగం కలిగించలేదన్నారు. హెచ్ సీఏ రాజ్యాంగాన్ని ఆ ఐదుగురు ఖూనీ చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. అపెక్స్ కౌన్సిల్ లో ఐదుగురు ఒక వర్గంగా ఏర్పడి… వాళ్ల నిర్ణయమే..అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంగా చెబితే ఎలా అని సూటిగా ప్రశ్నించారు. కౌన్సిల్ తనపై అసత్య ఆరోపణలు చేస్తోందన్న అజారుద్దీన్..అధ్యక్షుడిగా తన అనుమతి లేకుండా ఏమీ చేయలేరని స్పష్టం చేశారు.

అవినీతి బయటపడుతుందనే తనపై కుట్రలు చేస్తున్నారని, ఉద్దేశ్యపూర్వకంగా తనకు నోటీసులు అందించారని తెలిపారు. హెచ్‌‌సీఏలో అవినీతిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని, అవినీతిని అరికట్టడానికి అంబడ్స్ మన్ ను నియమిస్తే..అడ్డుకున్నారని ఆరోపించారు. HCAలో 25 ఏళ్లుగా బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చేస్తున్నారని వెల్లడించారు.

Read More : Viveka Case: వివేకా హత్య కేసులో జగదీశ్వర్ రెడ్డిని విచారిస్తున్న సీబీఐ