Babar Azam : పాకిస్థాన్‌కు భారీ షాక్‌.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న బాబ‌ర్ ఆజాం

Babar Azam : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో పాకిస్థాన్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేసింది. సెమీస్ చేర‌కుండానే ఆ జ‌ట్టు నిష్ర్క‌మించింది.

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో పాకిస్థాన్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేసింది. సెమీస్ చేర‌కుండానే ఆ జ‌ట్టు నిష్ర్క‌మించింది. దీంతో ఆ జ‌ట్టు పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టు కెప్టెన్ బాబ‌ర్ ఆజాం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. పాకిస్థాన్ జ‌ట్టు కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. అయితే.. ఓ ఆట‌గాడిగా మాత్రం అన్ని ఫార్మాట్ల‌లో కొన‌సాగుతున్నాడ‌ని చెప్పాడు. త‌మ జ‌ట్టు ఓట‌మికి నైతిక బాధ్య‌త వ‌హిస్తూ బాబ‌ర్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

‘పాకిస్థాన్ జ‌ట్టు కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్టాల‌ని 2019లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నుంచి పిలుపు వ‌చ్చింది. ఈ క్ష‌ణం నాకు ఇంకా గుర్తుకు ఉంది. ఈ నాలుగేళ్ల‌లో మైదానం లోప‌ల‌, బ‌య‌ట ఎన్నో ఎత్తుప‌ల్లాలు చూశాను. పాకిస్థాన్ గౌర‌వాన్ని నిల‌బెట్టేందుకు ప్ర‌య‌త్నించాను. కాగా.. ఇప్పుడు కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకోవడానికి ఇదే స‌మ‌యం అని భావిస్తున్నాను. కెప్టెన్‌గా త‌ప్పుకున్న‌ప్ప‌టికీ ఓ ఆట‌గాడిగా అన్ని ఫార్మాట్ల‌లో ఆడుతాను. త‌దుప‌రి కెప్టెన్ ఎవ‌రు అయినా స‌రే వారికి అన్ని విధాలుగా స‌హ‌క‌రిస్తాను. నాకు కెప్టెన్‌గా అవ‌కాశం ఇచ్చిన పీసీబీకి ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాను.’ అని బాబ‌ర్ ఆజాం సోష‌ల్ మీడియాలో తెలిపాడు.

Virat Kohli : సెంచ‌రీ త‌రువాత విరాట్ కోహ్లీ ఏం చేశాడంటే..? వీడియో వైర‌ల్‌..

సెమీస్ చేర‌కుండానే..

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో పాకిస్థాన్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేసింది. లీగు ద‌శ‌లో తొమ్మిది మ్యాచులు ఆడ‌గా కేవ‌లం నాలుగు మ్యాచుల్లో మాత్ర‌మే విజ‌యం సాధించింది. మ‌రో ఐదు మ్యాచుల్లో ఓడిపోయింది. దీంతో సెమీస్ చేర‌కుండానే ఇంటి ముఖం ప‌ట్టింది. దీంతో పాకిస్థాన్ జ‌ట్టు పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే పాకిస్థాన్ జ‌ట్టు బౌలింగ్ కోచ్ బాధ్య‌త‌ల నుంచి మోర్నీమోర్కెల్ త‌ప్పుకున్నాడు.

Sachin Tendulkar : నా హృద‌యాన్ని ట‌చ్ చేశావ్ కోహ్లీ.. ఆ రోజు నాకు న‌వ్వు ఆగ‌లేదు

కాగా.. బాబ‌ర్ ఆజాం బౌలింగ్‌లో పాకిస్థాన్ జ‌ట్టు వ‌న్డేల్లో నెం.1 జ‌ట్టుగా నిలిచింది. డిసెంబ‌ర్‌లో ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది పాకిస్థాన్‌. అప్ప‌టి వ‌ర‌కు కొత్త కెప్టెన్‌ను నియ‌మించే అవ‌కాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు