Badminton Asia Championships Pv Sindhu Enters Semifinals, Assured Of A Medal
PV Sindhu: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఆసియా ఛాంపియన్‌షిప్‌లో రెండు ఒలింపిక్ పతకాల పీవీ సింధు మరో మెడల్ ఖాయం చేసుకుంది. ఈ టోర్నీలో సింధు క్వార్టర్ ఫైనల్లో నుంచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం (ఏప్రిల్ 30) మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో నాల్గో సీడ్ సింధు 21-9, 13-21, 21-19తో ఐదో సీడ్ హి బింగ్జియావో (చైనా)పై గెలిచింది. ఆసియాలో టోర్నీలో సింధు ఖాతాలో చేరిన రెండో పతకం.. 2014 జిమ్‌చన్ దక్షిణ కొరియా ఆసియా ఛాంపియన్‌షిప్‌లో సింధు మొదటిసారిగా కాంస్య పతకాన్ని సాధించింది. శనివారం జరిగే (ఏప్రిల్ 30) సెమీస్‌లో టాప్ సీడ్ అకానె యమగూచి (జపాన్)తో సింధు తలపడనుంది.
ఈ సెమీస్‌లో గెలిస్తే.. ఆసియా టోర్నీలో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత క్రీడాకారిణిగా సింధు నిలువనుంది. సైనా నెహ్వాల్ (2010 ఢిల్లీ, 2016 వుహాన్, 2018 వుహాన్) మూడుసార్లు కాంస్య పతకాలనే కైవసం చేసుకుంది. ఆసియా టోర్నీలో భారత్ 9 పతకాలు సాధించింది. ఒకటి గోల్డ్ అయితే మరొకటి రజతం, 7 కాంస్యం పతకాలు ఉన్నాయి. క్వార్టర్స్‌లో చైనా బింగ్జియావోపై 7-9తో బరిలో దిగిన సింధు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. గంటా 16 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో పీవీ సింధు మరింత దూకుడును కనబర్చింది.
Badminton Asia Championships Pv Sindhu Enters Semifinals, Assured Of A Medal
తొలి గేమ్‌లో ఆకాశమే హద్దుగా ప్రదర్శన చేసింది. స్మాష్‌లు, హాఫ్ స్మాష్‌లు, బాడీ స్మాష్‌లు, క్రాస్‌కోర్ట్ షాట్‌లు, నెట్ సాధికారిక డ్రిబ్లింగ్‌తో సహా సింధు ప్రయోగించింది. ఫలితంగా 4-2తో గేమ్‌ను సింధు 11-2తో ముందంజ వేసింది. 21-9తో తొలి గేమ్ సింధు గెలిచింది. రెండో గేమ్‌లో ప్రత్యర్థి పుంజుకోగా.. సింధుపై ఎదురుదాడి చేస్తూ 6-4తో ఆధిక్యం సంపాదించింది. సింధు గట్టిగా పోరాడి 10-9తో ప్రత్యర్థిపై ఆధిపత్యం సాధించింది. నిర్ణయాత్మక మూడో గేమ్ సింధు ఆధిపత్యం ప్రదర్శించింది. సింధు షాట్లు ఆడుతూ 20-16తో మ్యాచ్ పాయింటుకు చేరుకుంది. బింగ్జియావో వరుసగా 3 పాయింట్లతో మ్యాచ్ పై అంచనాలను పెంచేయడంతో ఒక్క పాయింటుతో సింధు (21-19) మూడో గేమ్‌ను కైవసం చేసుకుంది సింధు.
Read Also : PV Sindhu : స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేత పీవీ సింధు