Bangladesh vs India: తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 314 పరుగులకే ఆలౌట్

భారత్-బంగ్లాదేశ్ మధ్య షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 314 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లా 227 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 87 పరుగుల ఆధిక్యత లభించింది. తొలి ఇన్నింగ్స్ లో భారత బ్యాట్స్‌మెన్ లో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ అర్ధసెంచరీలతో రాణించారు.

Bangladesh vs India: భారత్-బంగ్లాదేశ్ మధ్య షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 314 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లా 227 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 87 పరుగుల ఆధిక్యత లభించింది. తొలి ఇన్నింగ్స్ లో భారత బ్యాట్స్‌మెన్ లో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ అర్ధసెంచరీలతో రాణించారు.

వీరు మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. కేఎల్ రాహుల్ 10, శుభ్‌మన్ గిల్ 20, ఛటేశ్వర్ పుజారా 24, విరాట్ కోహ్లీ 24, రిషబ్ పంత్ 93, శ్రేయాస్ అయ్యర్ 87, అక్షర్ పటేల్ 4, రవిచంద్రన్ అశ్విన్ 12, జయదేవ్ 14(నాటౌట్), ఉమేశ్ యాదవ్ 14, మొహమ్మద్ సిరాజ్ 7 పరుగులు చేశారు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 314 పరుగులు చేసింది.

బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ అల్ హసన్, తైజుల్ ఇస్లాం నాలుగేసి వికెట్లు తీశారు. అహ్మద్, మెహిదీ హసన్ కు చెరో వికెట్టు దక్కాయి. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ లో నజ్ముల్ 24, జకీర్ హసన్ 15, మొమిన్ 84, షకీబ్ అల్ హసన్ 16, ముస్లఫికర్ రహీం 26, లిట్టోన్ 25, మెహిదీ 15, నురూల్ హసన్ 6, తాస్కిన్ అహ్మద్ 1, తైజుల్ ఇస్లాం 4, ఖలెద్ అహ్మద్ 0 పరుగులు చేశారు.

Sam Curran : ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్, ఎన్ని కోట్లో తెలుసా

ట్రెండింగ్ వార్తలు