Sam Curran : ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్, ఎన్ని కోట్లో తెలుసా

ఐపీఎల్ వేలంలో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ సామ్ కరణ్ రికార్డులు బద్దలుకొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు.

Sam Curran : ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్, ఎన్ని కోట్లో తెలుసా

Sam Curran : ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) వేలంలో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్, యువ ఆల్ రౌండర్ సామ్ కరణ్ రికార్డులు బద్దలుకొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. ఇప్పటివరకు సౌతాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ రూ.16.25 కోట్లతో టాప్ ప్లేస్ లో ఉండగా.. ఇప్పుడు కరన్ ఆ రికార్డును చెరిపేశాడు. రూ.18.50 కోట్లకు ఎడమ చేతి వాటం ప్లేయర్ కరణ్ ను పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది.

సామ్ కరన్ ను దక్కించుకోవడం కోసం ఫ్రాంచైజీలు పోటీలు పడ్డాయి. వేలం పాటను పెంచేశాయి. అతడి కనీస ధర రూ.2 కోట్లు కాగా.. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. చివరికి రూ.18.50 కోట్లతో శామ్ కరన్ ను పంజాబ్ కింగ్స్ చేజిక్కించుకుంది. 2008లో ఐపీఎల్ ప్రారంభం అయ్యాక, అప్పటినుంచి మరే ఆటగాడికీ ఇంత ధర లభించలేదు.

Also Read..IPL Two New Franchises : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోకి కొత్తగా రెండు టీమ్ లు

ఆస్ట్రేలియా క్రికెటర్ కామెరూన్ గ్రీన్ పంట కూడా పండింది. కామెరూన్ గ్రీన్ ను ఏకంగా 17.50 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా గ్రీన్ కోసం చివరి వరకు పోరాడింది. చివరకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. కామెరాన్ గ్రీన్ కనీస ధర రూ.2 కోట్లు కాగా, అతడిని ముంబై ఇండియన్స్ రూ.17.50 కోట్లతో కొనుగోలు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక ధర కావడం విశేషం.

ఇక ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్, సీనియర్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ సైతం కోట్లు కొల్లగొట్టాడు. రూ. 16.25 కోట్లకు బెన్ స్టోక్స్ ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఓ దశలో లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలు స్టోక్స్ కోసం పోటీపడ్డాయి. రూ.15 కోట్ల బిడ్ వద్ద సన్ రైజర్స్ రేసు నుంచి వైదొలగింది. ఇక స్టోక్స్ లక్నో జట్టుకే అని అందరూ భావించారు. ఇంతలో, చివరి నిమిషంలో సీఎస్కే ఫ్రాంచైజీ రంగంలోకి దిగింది. భారీతో ధరతో స్టోక్స్ ను దక్కించుకుంది.

Also Read..IPL Auction 2023: జాక్‌పాట్ కొట్టేదెవ‌రో? నేడు ఐపీఎల్ మినీ వేలం.. ఆ ప్లేయ‌ర్స్‌వైపు ప్రాంచైజీల చూపు

కొచ్చి వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 సీజన్ మినీ వేలం పాట జరుగుతోంది. ఈసారి ఆటగాళ్ల జాబితాలో అత్యంత పిన్న వయస్కుడు అఫ్ఘానిస్తాన్‌కు చెందిన అల్లా మొహ్మద్ ఘజ్నాఫర్. ఇతని వయస్సు 15 ఏళ్లు మాత్రమే. ఐపీఎల్ మినీ వేలంలో మొత్తం అన్ని ఫ్రాంఛైజీలు పాల్గొంటున్నాయి. ఇప్పటికే కొంతమంది ఆటగాళ్లను ఆయా జట్లు రిలీజ్ చేశాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.