IPL Auction 2023: జాక్‌పాట్ కొట్టేదెవరో? నేడు ఐపీఎల్ మినీ వేలం.. ఆ ప్లేయర్స్‌వైపు ప్రాంచైజీల చూపు
ఈ మినీ వేలంకు సంబంధించి ప్రాంచైజీలు.. ఇంకా అరంగ్రేటం చేయని కొంతమంది దేశీ ఆటగాళ్ల కొనుగోలుపై అధికశాతం దృష్టిసారించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రాంచైజీల వద్ద తక్కువ డబ్బు ఉండటమే కారణంగా తెలుస్తోంది.

IPL Auction 2023: ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) ప్రాంచైజీలు మినీ వేలానికి సిద్ధమయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం కొచ్చిలో వేలం ప్రక్రియ జరగనుంది. ప్రస్తుతం జరగనున్న వేలం మెగా వేలం లాంటిది కాదు. ప్రాంచైజీల వద్ద తక్కువ డబ్బుతో పాటు, అమ్మకానికి తక్కువ మంది ఆటగాళ్లు అందుబాటులో ఉంటారు. ఈ మినీ వేలానికి మొత్తం 991 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, తుది జాబితాలో ఆ సంఖ్యను 405కు కుదించారు. అయితే, వీరిలో 273మంది భారత ఆటగాళ్లుకాగా, 132 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వీరు నేడు జరిగే మినీవేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
IPL Two New Franchises : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోకి కొత్తగా రెండు టీమ్ లు
ఈ మినీ వేలంకు సంబంధించి ప్రాంచైజీలు.. ఇంకా అరంగ్రేటం చేయని కొంతమంది దేశీ ఆటగాళ్ల కొనుగోలుపై అధికశాతం దృష్టిసారించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రాంచైజీల వద్ద తక్కువ డబ్బు ఉండటమే కారణంగా తెలుస్తోంది. హైదరాబాద్ (13) , కోల్‌కతా (11), లఖ్‌నవూ (10) ఫ్రాంజైజీలకు మాత్రమే పది, అంతకంటే ఎక్కువ మంది ప్లేయర్లు అవసరం ఉంది. మిగిలిన ఫ్రాంచైజీలకు పది కంటే తక్కువ మంది ప్లేయర్లు అవసరం ఉంది. ఢిల్లీ జట్టుకు కేవలం ఐదుగురు మాత్రమే భర్తీ చేసుకొనే అవకాశం ఉంది. ప్రాంచైజీల వద్ద డబ్బుసైతం తక్కువగానే ఉంది. హైదరాబాద్ జట్టు వద్ద అత్యధికంగా 42.25 కోట్లు డబ్బు మిగిలి ఉండగా, కోల్‌కతా జట్టు వద్ద అతితక్కువగా 7.05కోట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తం పది జట్లు పాల్గొనే ఈ ఐపీఎల్ టోర్నీలో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లే లక్ష్యంగా నేటి వేలంలో దృష్టిసారించనున్నారు.
CSK IPL 2023: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్..! ధోనీ, హస్సీ ఫుల్ సపోర్ట్?
ఈరోజు జరిగే మినీ ఐపీఎల్ వేలంలో అతి చిన్న వయ్ససు కలిగి ఆటగాడు మహ్మద్ ఘజాన్‌ఫార్, ఆఫ్గానిస్థాన్‌కు చెందిన స్పిన్నర్‌కు కేవలం 15ఏళ్లు మాత్రమే. అత్యధిక వయస్సు కలిగిన వారిలో భారత మాజీ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా. ఈ వేలంలో 40ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి అమిత్ మిశ్రా ఒక్కరే. ఒక్క ఫ్రాంచైజీకి కనిష్ఠంగా 18మంది, గరిష్ఠంగా 25 మంది ఆటగాళ్లు ఉండాలి. ఒక జట్టులో గరిష్టంగా ఎనిమిది మంది విదేశీ క్రికెటర్లకు చోటుంటుంది.