CSK IPL 2023: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్..! ధోనీ, హస్సీ ఫుల్ సపోర్ట్?

2023 సీజన్ కు ధోనీనే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ధోనీకి ప్రస్తుతం 41ఏళ్లు. ఈ ఒక్క సీజన్ కు మాత్రమే ధోనీ కెప్టెన్ గా కొనసాగే అవకాశం ఉంది. మరి 2024 లో జరిగే ఐపీఎల్ లో జట్టుకు సారథ్యం వహించేది ఎవరు? అనే ప్రశ్న ఇప్పుడు జట్టు మేనేజ్ మెంట్ ను, సీఎస్‌కే అభిమానులకు ఎదురవుతుంది.

CSK IPL 2023: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్..! ధోనీ, హస్సీ ఫుల్ సపోర్ట్?

CSK Team

CSK IPL 2023: వచ్చే ఏడాది మార్చి నెలలో చివరివారం నుంచి ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) సందడి షురూ కానుంది. దీంతో అన్ని జట్ల యాజమాన్యాలు ఇప్పటి నుంచే తమతమ ఆటగాళ్లను సన్నద్ధం చేస్తున్నాయి. ఈసారి ఐపీఎల్‌లో టైటిల్ గెలిచేందుకు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) పట్టుదలతో ఉంది. సీఎస్‌కే కు ఐపీఎల్ ప్రారంభం నుంచి అధిక సార్లు కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీనే కొనసాగాడు. 2023లో భారత్‌లో జరగనున్న 16వ ఎడిషన్ లీగ్‌లో సీఎస్‌కే ధోనీ ఆధ్వర్యంలో నే బరిలోకి దిగుతుంది. 2023 సీజన్ కు ధోనీనే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ధోనీకి ప్రస్తుతం 41ఏళ్లు. ఈ ఒక్క సీజన్ కు మాత్రమే ధోనీ కెప్టెన్ గా కొనసాగే అవకాశం ఉంది. మరి 2024 లో జరిగే ఐపీఎల్ లో జట్టుకు సారథ్యం వహించేది ఎవరు? అనే ప్రశ్న ఇప్పుడు జట్టు మేనేజ్ మెంట్ ను, సీఎస్‌కే అభిమానులకు ఎదురవుతుంది.

IPL Auction: డిసెంబర్ 23న ఐపీఎల్ మినీ వేలం.. పోటీలో 991 మంది ఆటగాళ్లు.. ఆస్ట్రేలియా ప్లేయర్సే టాప్

అయితే, ఈ ప్రశ్నకు జట్టు మేనేజ్ మెంట్‌కు సమాధానం దొరికినట్లు తెలుస్తోంది. తొలుత జట్టు యాజమాన్యం ఐపీఎల్ -2024కు కెప్టెన్‌గా జడేజాను అనుకున్నప్పటికీ.. 2022 ఐపీఎల్‌లో జడేజా కెప్టెన్ గా విఫలమయ్యాడు. సీజన్ మధ్యలో మళ్లీ ధోనీకే పగ్గాలు అప్పగించాల్సి వచ్చింది. కానీ, 2024లో ధోనీ కెప్టెన్ గా కొనసాగే అవకాశాలు లేవు. గత కొన్ని సీజన్‌లుగా జట్టు కోసం బాగా రాణిస్తున్న ఆటగాళ్లలో ఎవరో ఒకరిని కెప్టెన్ గా ఎన్నుకోవాలి. అటువంటి తరుణంలో.. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ పేరు పరిశీలనలోకి వచ్చినట్లు తెలుస్తోంది. అతను తన దేశీయ జట్టు మహారాష్ట్రను విజయ్ హజారే ట్రోఫీ 2022 ఫైనల్‌కు నడిపించాడు. అదే సమయంలో అనేక బ్యాటింగ్ రికార్డులను కూడా బద్దలు కొట్టాడు. గైక్వాడ్ యువకుడు, ప్రశాంతత, అద్భుతమైన బ్యాటర్. దీంతో సీఎస్‌కే జట్టు యాజమాన్యం.. రుతురాజ్ గైక్వాడ్ వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.

రుతురాజ్ గైక్వాడ్‍కు జట్టు పగ్గాలు అప్పగించేందుకు ధోనీ, సీఎస్‌కే జట్టు కోచ్ మైఖేల్ హస్సీ కూడా తమ మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. మైఖేల్ హస్సీ ధోనీ తరువాత జట్టు నడిపించగలిగే వ్యక్తి గైక్వాడే అని, ఆ సామర్థ్యాలు అతనికే మెండుగా ఉన్నాయని యాజమాన్యం వద్ద బలంగా చెప్పినట్లు సమాచారం. దీంతో.. అన్నీ అనుకున్నట్లు కుదిరితే 2024 ఐపీఎల్ లో సీఎస్‌కే జట్టు పగ్గాలు గైక్వాడ్ చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.