IPL Two New Franchises : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోకి కొత్తగా రెండు టీమ్ లు

2022లో ఐపీఎల్ టోర్నీలోకి రెండు కొత్త ప్రాంచైసీలు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేరడంతో మీడియా హక్కుల వేలం రూపంలో ఐపీఎల్ మేనేజ్ మెంట్ కు, దాని నిర్వహక సంస్థ బీసీసీఐకి వచ్చిన నిధులు 10.9 బిలియన్ డాలర్లు. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ విలువ 1.6బిలియన్ డాలర్లు.

IPL Two New Franchises : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోకి కొత్తగా రెండు టీమ్ లు

IPL

IPL Two New Franchises : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ స్వరూపాన్నే మార్చేసింది. క్రికెటర్లకు, కార్పొరేట్ సంస్థలకు కాసులు కురిపిస్తోంది. గత రెండేళ్లలో ఐపీఎల్ బిజినెస్ విలువ అక్షరాల 10 బిలియన్ డాలర్లు. 2022లో ఐపీఎల్ విలువ 10 బిలియన్ డాలర్లు దాటేసింది. 2020 తర్వాత డాలర్ల రూపేణా 6.2 బిలియన్ డాలర్ల నుంచి 10.9 బిలియన్ డాలర్ల మార్క్ కు చేరుకుంది. మన రూపాయిల్లో 90 శాతం వృద్ధి నమోదైతే.. డాలర్లలో 75 శాతం దాటిందని డీ అండ్ పీ అడ్వైజరీ సంస్థ విడుదల చేసిన నివేదిక పేర్కొంది.

2022లో ఐపీఎల్ టోర్నీలోకి రెండు కొత్త ప్రాంచైసీలు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేరడంతో మీడియా హక్కుల వేలం రూపంలో ఐపీఎల్ మేనేజ్ మెంట్ కు, దాని నిర్వహక సంస్థ బీసీసీఐకి వచ్చిన నిధులు 10.9 బిలియన్ డాలర్లు. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ విలువ 1.6బిలియన్ డాలర్లు. స్థిరమైన కరెన్సీ ప్రాతిపదికన ఐపీఎల్ విలువ 12 బిలియన్ డాలర్లకు చేరువలో ఉంది.

Nicholas Pooran: ఐపీఎల్ వేలంలో రూ.10.75కోట్ల డీల్.. నికోలస్ పూరన్ పిజ్జా పార్టీ.. ఎంత డబ్బు ఖర్చు చేశాడంటే?

అయితే ఫారెక్స్ మార్కెట్ లో అమెరికా డాలర్ పై రూపాయి మారకం విలువ 10-12 శాతం పతనమైంది. ఈ ఏడాది రెండు విభిన్న రైట్స్ హోల్డర్ల మధ్య తొలిసారి వేరువేరుగా మీడియా హక్కులను బీసీసీఐ వేలం వేసింది. ఐపీఎల్ టీవీ రైట్స్ హక్కులు రూ. 23,575 కోట్లకు డిస్నీ స్టార్ గెలుచుకుంది. డిజిటల్ రైట్స్ వయాకామ్ 18 సంస్థ 23,758కోట్లకు దక్కించుకుంది.

ఇక తర్వాతి సెషన్ టోర్నమెంట్ లో మ్యాచ్ ల సంఖ్య 74 నుంచి 94 పెంచారు. తదనుగుణంగా దాని విలువ పెరుగుతుందని ఐపీఎల్ వర్గాలు చెబుతున్నాయి. టిక్కెట్ల సేల్స్, ఇన్ స్టేడియం రెవెన్యూ రూపంలో ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆడుతున్న టీమ్ ల విలువ 400 – 600 మిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని అంచనా.