Nicholas Pooran: ఐపీఎల్ వేలంలో రూ.10.75కోట్ల డీల్.. నికోలస్ పూరన్ పిజ్జా పార్టీ.. ఎంత డబ్బు ఖర్చు చేశాడంటే?

ఐపీఎల్ వేలంలో వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్.. తన తోటి ఆటగాళ్లకు పిజ్జా పార్టీ ఇచ్చాడు.

Nicholas Pooran: ఐపీఎల్ వేలంలో రూ.10.75కోట్ల డీల్.. నికోలస్ పూరన్ పిజ్జా పార్టీ.. ఎంత డబ్బు ఖర్చు చేశాడంటే?

Nicholas Pooran

Updated On : February 16, 2022 / 12:06 PM IST

Nicholas Pooran: ఐపీఎల్ వేలంలో వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్.. తన తోటి ఆటగాళ్లకు పిజ్జా పార్టీ ఇచ్చాడు. వేలంలో పెద్దమొత్తం దక్కిందనే ఆనందంలో ఈ పార్టీ పెట్టారు. ఈ పార్టీలో పూరన్ మొత్తం రూ.15వేలకు ఖర్చు పెట్టారు. వాస్తవానికి బయటి ఆహారం తీసుకోవడానికి ఇరు జట్ల క్రికెటర్లకు అనుమతి లేదు.

అందువల్లే, నికోలస్ పూరన్ హోటల్‌లోనే 15 పిజ్జాలు ఆర్డర్ ఇచ్చాడు. వెస్టిండీస్ ఆటగాడు గ్రేడ్-1 బయో-బబుల్‌లో ఉన్నాడు. ఈ సమయంలో ఆహారం ఉష్ణోగ్రతను కూడా చూడాల్సి వస్తోంది. కచ్చితంగా అన్ని కోవిడ్ ప్రమాణాలను పాటించాల్సి వస్తుంది. అర్హత కలిగిన చెఫ్‌లు మాత్రమే ఆర్డర్‌లను తీసుకుంటారు. ఆరోజు 15 పిజ్జా బాక్స్‌లు గదిలోకి వెళ్లాయి. అన్నీ ముందుగానే శానిటైజ్ చేసి సిద్ధం చేసి ఇచ్చినట్లు అక్కడి మేనేజర్ వెల్లడించారు.

ఐపీఎల్ 2022 మెగా వేలంలో 10 కోట్లకు పైగా పొందిన 11 మంది ఆటగాళ్లలో నికోలస్ పూరన్ ఒకరు. IPL 2021లో ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ ప్రదర్శన మాత్రం చాలాకాలంగా పేలవంగా ఉంది. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడి 7.72 సగటుతో కేవలం 85 పరుగులు మాత్రమే చేసిన పూరన్.. భారత్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో కూడా పెద్దగా రాణించలేదు. అయితే, అతని కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టింది.