Aus Vs Bangladesh
AUS Vs Bangladesh : ఆస్ట్రేలియాతో జరిగిన తోలి టీ20 మ్యాచ్ లో బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది. ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా మంగళవారం మొదటి టీ20 బంగ్లాదేశ్ లోని మిర్పూర్ లో జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 131 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా 108 పరుగులకే ఆల్ అవుట్ అయింది.
దీంతో 23 పరుగుల తేడాడో బంగ్లాదేశ్ విజయం సాధించింది. బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాపై టీ20 గెలవడం ఇదే తొలిసారి. ఇక ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ బౌలర్ నసుమ్ అహ్మద్ 4 వికెట్లు పడగొట్టాడు. ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరిపుల్ ఇస్లాం చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్ ఒక్కడే 45 పరుగులు చేయగా, మిగతా వారంతా విఫలమయ్యారు. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లా 1-0 ఆధిక్యాన్ని సాధించింది.