Asia Cup 2025 Team India Squad : ఆసియా కప్‌ 2025కు భార‌త జ‌ట్టు ఇదే.. కెప్టెన్‌గా సూర్య‌.. వైస్ కెప్టెన్‌గా గిల్‌, శ్రేయ‌స్‌కు నో ప్లేస్‌..

ఆసియాక‌ప్ 2025లో పాల్గొనే భార‌త జ‌ట్టును (Asia Cup 2025 Team India Squad ) బీసీసీఐ ప్ర‌క‌టించింది. సూర్య‌కుమార్ యాద‌వ్ నేతృత్వంలోనే..

BCCI announced Team India Squad squad for Asia Cup 2025

Asia Cup 2025 Team India Squad : సెప్టెంబ‌ర్ 9 నుంచి యూఏఈ వేదిక‌గా ఆసియా క‌ప్ 2025 ప్రారంభం కానుంది. 8 జ‌ట్లు క‌ప్పుకోసం పోటీప‌డ‌నున్నాయి. ఈ టోర్నీలో పాల్గొనే ప‌లు జ‌ట్లు ఇప్ప‌టికే త‌మ త‌మ జ‌ట్ల‌ను ప్ర‌క‌టించ‌గా తాజాగా బీసీసీఐ భార‌త జ‌ట్టును (Asia Cup 2025 Team India Squad) ప్ర‌క‌టించింది. 15 మంది స‌భ్యులతో కూడాన స్క్వాడ్‌ను ఎంపిక చేసింది. సూర్య‌కుమార్ యాద‌వ్ నేతృత్వంలోనే టీమ్ఇండియా ఈ మెగాటోర్న‌లో బ‌రిలోకి దిగ‌నుంది. వైస్ కెప్టెన్‌గా శుభ్‌మ‌న్‌ గిల్ ఎంపిక అయ్యాడు.

రెగ్యుల‌ర్ ఓపెన‌ర్లు సంజూ శాంస‌న్‌, అభిషేక్ శ‌ర్మ‌ల‌తో పాటు మూడో ఓపెన‌ర్‌గా గిల్‌కు చోటు ఇచ్చారు. మిడిల్ ఆర్డ‌ర్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్‌, తిల‌క్ వ‌ర్మ‌లు చోటు ద‌క్కించుకున్నారు. ఆల్‌రౌండ‌ర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా, శివ‌మ్‌దూబే, అక్ష‌ర్ ప‌టేల్‌లు జ‌ట్టులో వ‌చ్చారు.

PCB : బాబ‌ర్ ఆజామ్‌, రిజ్వాన్‌ల‌కు పీసీబీ మ‌రో షాక్‌.. మొన్న టీ20 జ‌ట్టు నుంచి తొల‌గిస్తే.. నేడు ఏకంగా..

ఫినిష‌ర్‌గా రింకూసింగ్‌కు ఎంపిక కాగా.. ఇక పేస్ భారాన్ని జ‌స్‌ప్రీత్ బుమ్రాతో క‌లిసి అర్ష్‌దీప్ సింగ్‌, హ‌ర్షిత్ రాణాలు మోయ‌నున్నారు. స్పెష‌లిస్టు స్పిన్న‌ర్లుగా కుల్దీప్ యాద‌వ్‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తిల‌కు చోటు ద‌క్కింది.

ఆసియా క‌ప్ 2025 కోసం భార‌త జట్టు ఇదే..

సూర్య‌కుమార్ యాద‌వ్ (కెప్టెన్‌), శుభ్‌మ‌న్ గిల్ (వైస్ కెప్టెన్‌), అభిషేక్ శ‌ర్మ‌, తిల‌క్ వ‌ర్మ‌, హార్దిక్ పాండ్యా, శివ‌మ్‌దూబే, అక్ష‌ర్ ప‌టేల్‌, జితేశ్ శ‌ర్మ‌, జ‌స్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, కుల్దీప్ యాద‌వ్‌, సంజూ శాంస‌న్‌, హ‌ర్షిత్ రాణా, రింకూ సింగ్‌.

Ambati Rayudu : అవును.. బౌండ‌రీ లైన్ జ‌రిపారు.. సూర్య‌కుమార్ యాద‌వ్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ విన్నింగ్ క్యాచ్ పై అంబ‌టి రాయుడు..

సెప్టెంబ‌ర్ 9 నుంచి 28 వ‌ర‌కు ఆసియాక‌ప్ 2025 టోర్నీ జ‌ర‌గ‌నుంది. ఈ టోర్నీలో భార‌త జ‌ట్టు త‌న తొలి మ్యాచ్‌ను ఆతిథ్య యూఏఈతో సెప్టెంబ‌ర్ 10న త‌ల‌ప‌డ‌నుంది. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూసే భార‌త్‌, పాక్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ సెప్టెంబ‌ర్ 14న జ‌ర‌గ‌నుంది. ఇక గ్రూప్ స్టేజీలో భార‌త్ సెప్టెంబ‌ర్ 19న ఒమ‌న్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఆ త‌రువాత సెప్టెంబ‌ర్ 20 నుంచి సూప‌ర్ 4 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.

ఆసియా కప్‌ షెడ్యూల్ ఇదే..

గ్రూప్‌ స్టేజ్‌..

సెప్టెంబర్ 9న – అఫ్గానిస్థాన్ వ‌ర్సెస్‌ హాంకాంగ్‌
సెప్టెంబర్ 10న – భారత్‌ వ‌ర్సెస్‌ యూఏఈ
సెప్టెంబర్ 11న – బంగ్లాదేశ్‌ వ‌ర్సెస్‌ హాంకాంగ్‌
సెప్టెంబర్ 12న – పాకిస్థాన్‌ వ‌ర్సెస్‌ ఒమన్‌
సెప్టెంబర్ 13న – బంగ్లాదేశ్‌ వ‌ర్సెస్‌ శ్రీలంక
సెప్టెంబర్ 14న‌ భారత్‌ వ‌ర్సెస్‌ పాకిస్థాన్‌
సెప్టెంబర్ 15న – శ్రీలంక వ‌ర్సెస్‌ హాంకాంగ్‌
సెప్టెంబర్ 16న – బంగ్లాదేశ్‌ వ‌ర్సెస్‌ అఫ్గానిస్థాన్‌
సెప్టెంబర్ 17న – పాకిస్థాన్‌ వ‌ర్సెస్‌ యూఏఈ
సెప్టెంబర్ 18న – శ్రీలంక వ‌ర్సెస్‌ అఫ్గానిస్థాన్‌
సెప్టెంబర్ 19న – భారత్‌ వ‌ర్సెస్‌ ఒమన్‌

సూపర్ 4 మ్యాచ్‌లు..

సెప్టెంబర్ 20న‌ – గ్రూప్‌ బి క్వాలిఫయర్‌ 1 వ‌ర్సెస్‌ గ్రూప్‌ బి క్వాలిఫయర్‌ 2
సెప్టెంబర్ 21న – గ్రూప్‌ ఏ క్వాలిఫయర్‌ 1 వ‌ర్సెస్‌ గ్రూప్‌ ఏ క్వాలిఫయర్‌ 2
సెప్టెంబర్ 23న – గ్రూప్‌ ఏ క్వాలిఫయర్‌ 1 వ‌ర్సెస్‌ గ్రూప్‌ బి క్వాలిఫయర్‌ 2
సెప్టెంబర్ 24న – గ్రూప్‌ బి క్వాలిఫయర్‌ 1 వ‌ర్సెస్‌ గ్రూప్‌ ఏ క్వాలిఫయర్‌ 2
సెప్టెంబర్ 25 న‌ గ్రూప్‌ ఏ క్వాలిఫయర్‌ 2 వ‌ర్సెస్‌ గ్రూప్‌ బి క్వాలిఫయర్‌ 2
సెప్టెంబర్ 26న – గ్రూప్‌ ఏ క్వాలిఫయర్‌ 1 వ‌ర్సెస్‌ గ్రూప్‌ బి క్వాలిఫయర్‌ 1

ఫైన‌ల్‌..

సెప్టెంబర్ 28న – ఫైనల్‌ మ్యాచ్‌