BCCI announces India Test squad for West Indies series
IND vs WI : టీమ్ఇండియా ప్రస్తుతం ఆసియాకప్ 2025 బిజీలో ఉంది. ఈ మెగాటోర్నీ అనంతరం స్వదేశంలో భారత జట్టు వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ను ఆడనుంది. అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో (IND vs WI) పాల్గొనే భారత జట్టును సెలక్టర్లు ప్రకటించారు. గిల్ సారథ్యంలోనే భారత్ బరిలోకి దిగనుంది. వైస్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా వ్యవహరించనున్నాడు.
కరుణ్ నాయర్ ఔట్..
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమైన సీనియర్ ఆటగాడు కరుణ్ నాయర్ పై అనుకున్నట్లుగానే వేటు పడింది. అతడి స్థానంలో దేశవాళీలో నిలకడగా ఆడుతున్న దేవ్‌దత్ పడిక్కల్‌కు ఛాన్స్ ఇచ్చారు. ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టులో గాయపడిన రిషబ్ పంత్ ఇంకా కోలుకోలేదు. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్‌కు వికెట్ కీపింగ్ బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. ఇక గాయం నుంచి కోలుకున్న తెలుగు ఆటగాడు నితీష్‌కుమార్ రెడ్డి జట్టులోకి వచ్చేశాడు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో అతడు ఎంపిక అయ్యాడు.
జట్టు ఎంపికపై అజిత్ అగార్కర్ ఏమన్నాడంటే..?
జట్టును ప్రకటించిన తరువాత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మీడియాతో మాట్టాడాడు. గత సిరీస్‌లలో ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి చాలా బాగా ఆడాడని మెచ్చుకున్నాడు. అతడి పై భారీ అంచనాలు ఉన్నాయని, అతడికి మరిన్ని అవకాశాలు ఇస్తే.. ఇంకా మెరుగ్గా రాణిస్తాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.
భారత్-ఏ జట్టుకు ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేసే సమయంలో అతడు ఫిట్‌గా లేడన్నాడు. అయితే.. ప్రస్తుతం అంతా బాగుందని చెప్పుకొచ్చాడు. అయినప్పటికి ఇషాన్ దేశవాళీలో ఇంకొన్ని మ్యాచ్‌లు ఆడితే బాగుంటుందనే ఉద్దేశంతోనే అతడిని తీసుకోలేదన్నాడు. బుమ్రా వర్క్‌లోడ్ గురించి ఫిజియోలతో మాట్లాడినట్లుగా తెలిపాడు. రెండు టెస్టులకు అతడు అందుబాటులో ఉంటాడన్నాడు.
🚨 Presenting #TeamIndia‘s squad for the West Indies Test series 🔽#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/S4D5mDGJNN
— BCCI (@BCCI) September 25, 2025
Jaker Ali : అందుకే భారత్ పై ఓడిపోయాం.. లేదంటేనా.. బంగ్లాదేశ్ కెప్టెన్ జాకీర్ అలీ కామెంట్స్..
షమీ ఫిట్‌నెస్‌కు సంబంధించి తమకు ఎలాంటి అప్‌డేట్ రాలేదన్నాడు. టీమ్ఇండియా తరుపున ఆడే సత్తా అతడిలో ఇంకా ఉందన్నాడు. ఇక ఇంగ్లాండ్ పర్యటనలో కరుణ్ నాయర్ నుంచి ఎంతో ఆశించామని, అయితే.. అతడు నిరాశపరిచాడని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాలో పడిక్కల్ బాగా ఆడాడని, తప్పకుండా వెస్టిండీస్ పై రాణిస్తాడనే ధీమాను వ్యక్తం చేశాడు.
వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్, జగదీషన్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్.