Asia Cup 2025 : భారత్ చేతిలో ఓడిపోయినా.. ఫైనల్ చేరేందుకు బంగ్లాదేశ్‌కు గోల్డెన్ ఛాన్స్.. ఎలాగో తెలుసా?
భారత్ చేతిలో ఓడిపోయినప్పటికి కూడా బంగ్లాదేశ్‌కు ఆసియాకప్ 2025 (Asia Cup 2025) ఫైనల్‌కు చేరుకునే ఛాన్స్ ఉంది.

Asia Cup 2025 today match between Pakistan and Bangladesh in super 4
Asia Cup 2025 : ఆసియాకప్ 2025 సూపర్-4లో భాగంగా బుధవారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు ఓడిపోయింది. బంగ్లాపై గెలవడంతో టీమ్ఇండియా ఈ టోర్నీ (Asia Cup 2025) ఫైనల్‌లో అడుగుపెట్టింది.
మరోవైపు శ్రీలంక జట్టు ఈ టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య నేడు (గురువారం సెప్టెంబర్ 25) కీలక మ్యాచ్ జరగనుంది.
Rohit Sharma : 10వేల గ్రాముల వెయిట్ తగ్గిన రోహిత్ శర్మ.. అభిషేక్ నాయర్ పోస్ట్ వైరల్
సూపర్-4 స్టేజీలో బంగ్లాదేశ్, పాక్ జట్లు ఒక్కొ మ్యాచ్‌లో విజయాన్ని సాధించాయి. చెరో రెండు పాయింట్లతో సమానంగా ఉన్నాయి. అయితే.. బంగ్లాదేశ్ (-0.969) కంటే పాకిస్తాన్ (+0.226) నెట్‌రన్‌రేటు మెరుగ్గా ఉంది. పాయింట్ల పట్టికలో పాక్ రెండో స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్ మూడో స్థానంలో కొనసాగుతోంది. తొలి స్థానంలో ఉన్న భారత్ ఇప్పటికే ఫైనల్‌లో అడుగుపెట్టింది.
గురువారం దుబాయ్ వేదికగా జరగనున్న పాక్, బంగ్లాల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్ అడుగుపెడుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్ర్కమిస్తుంది. భారత్ పై ఓడిపోయినప్పటికి శ్రీలంక పై విజయం సాధించడంతో పాక్ జట్టు ఆత్మవిశ్వాసంతో ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ పేసర్ షాహిన్ షా అఫ్రిది ఫామ్ అందుకోవడం ఆ జట్టుకు గొప్ప ఊరటగా చెప్పవచ్చు.
Sunil Gavaskar : బంగ్లాదేశ్ పై తుఫాన్ ఇన్నింగ్స్.. అభిషేక్ శర్మ పై మండిపడిన సునీల్ గవాస్కర్..
మరోవైపు బంగ్లాదేశ్ బ్యాటింగ్ విభాగం తడబడుతోంది. గాయంతో కెప్టెన్ లిటన్ దాస్ భారత్‌తో మ్యాచ్‌కు తప్పుకోవడం కూడా ఆ జట్టు ఓటమికి గల కారణాల్లో ఒకటిగా చెప్పవచ్చు. పాక్‌తో మ్యాచ్‌లోనైనా లిటన్ ఆడతాడా? లేదా ? అన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.
చూడాలి మరి ఈ మ్యాచ్‌లో గెలిచి ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌తో ఎవరు తలపడతారో.