Rohit Sharma : 10వేల గ్రాముల వెయిట్ తగ్గిన రోహిత్ శర్మ.. అభిషేక్ నాయర్ పోస్ట్ వైరల్
రోహిత్ శర్మ (Rohit Sharma) తన ఫిట్‌నెస్ పై దృష్టి సారించాడు. ఈ క్రమంలో ఏకంగా 10 కిలోలు తగ్గాడు. ఈ విషయాన్ని..

Rohit Sharma 10kg Weight Loss Abhishek Nayar social media post
Rohit Sharma : టీమ్ఇండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టులు, టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హిట్‌మ్యాన్ కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ 2025 లో పాల్గొన్న హిట్‌మ్యాన్ ఆ తరువాత ఎలాంటి క్రికెట్ మ్యాచ్‌లు ఆడలేదు. అక్టోబర్‌లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో ఆతిథ్య ఆస్ట్రేలియాతో భారత్ వన్డేలతో పాటు టీ20లు ఆడనుంది. ఈ వన్డే సిరీస్‌తోనే రోహిత్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు.
ఈ క్రమంలో హిట్‌మ్యాన్ తన ఫిట్‌నెస్ పై పూర్తిగా దృష్టి సారించాడు. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తో కలిసి పని చేస్తున్నాడు.
Sunil Gavaskar : బంగ్లాదేశ్ పై తుఫాన్ ఇన్నింగ్స్.. అభిషేక్ శర్మ పై మండిపడిన సునీల్ గవాస్కర్..
కాగా.. రోహిత్ శర్మ (Rohit Sharma) 10 కేజీల బరువు తగ్గాడు. ఈ విషయాన్ని అభిషేక్ నాయర్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. రోహిత్‌తో ఉన్న ఫోటోను పంచుకున్నాడు. ‘10000 గ్రాములు తగ్గిన తర్వాత… ఇంకా మేము దీనిని ప్రయత్నిస్తూనే ఉన్నాము.’ అని ఫోటోకు క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది.
2027 వన్డే ప్రపంచకప్ ఆడతాడా?
38 ఏళ్ల రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్ ఆడతాడా? లేదా అన్నదానిపై అనిశ్చితి నెలకొంది. అయితే.. ఈ ఏడాది ప్రారంభంలో రోహిత్ నాయకత్వంలోనే భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. వన్డే ప్రపంచకప్ గెలవడమే తన కల అని ఇప్పటికే పలు సందర్భాల్లో హిట్‌మ్యాన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో 2027 వన్డే ప్రపంచకప్ ఆడడమే తన టార్గెట్ అని రోహిత్ చెప్పకనే చెప్పాడు.
Jaker Ali : అందుకే భారత్ పై ఓడిపోయాం.. లేదంటేనా.. బంగ్లాదేశ్ కెప్టెన్ జాకీర్ అలీ కామెంట్స్..
అయితే.. మరోవైపు శుభ్‌మన్ గిల్‌ను మూడు ఫార్మాట్లకు నాయకుడిని చేయాలనే ఆలోచనలో బీసీసీఐ ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే హిట్‌మ్యాన్‌కు ఉద్వాసన పలకనుందని అంటున్నారు. ఏదీ ఏమైనప్పటికి కూడా ఆస్ట్రేలియాతో అక్టోబర్‌లో జరగనున్న వన్డే సిరీస్‌తో రోహిత్ శర్మ భవితవ్యం తేలే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో హిట్‌మ్యాన్ విఫలం అయితే మాత్రం అతడి అంతర్జాతీయ కెరీర్ దాదాపుగా ముగిసినట్లేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.