ENG vs IND : ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు భార‌త జ‌ట్టు ఇదే.. రీ ఎంట్రీ ఇచ్చిన స్టార్ ప్లేయ‌ర్‌.. జ‌ట్టులో ఎవరికి ఛాన్స్ ద‌క్కిందంటే..?

వ‌చ్చే నెల (జూన్‌లో) భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఇంగ్లాండ్‌లో ప‌ర్య‌టించ‌నుంది.

BCCI Announces India Women Squads For England Tour 2025

వ‌చ్చే నెల (జూన్‌లో) భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఇంగ్లాండ్‌లో ప‌ర్య‌టించ‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌తో భార‌త్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌, మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌ల‌ను ఆడ‌నుంది. ఈ క్ర‌మంలో టీ20, వ‌న్డే సిరీస్‌ల‌లో పాల్గొనే భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది. హ‌ర్మ‌న్‌ప్రీత్‌ కౌర్ నాయ‌క‌త్వంలోనే భార‌త్ ఈ సిరీస్‌ల్లో బ‌రిలోకి దిగ‌నుంది. వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంపికైంది.

స్టార్ ప్లేయ‌ర్లు శ్రేయాంక పాటిల్, రేణుకా సింగ్ లు గాయాల‌తో ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు దూరం అయ్యారు. రేణుకా మోకాలి గాయంతో బాధ‌ప‌డుతుండ‌గా, శ్రేయాంక చేతి వేలికి గాయ‌మైంది. ఫామ్ లేమీతో జ‌ట్టులో స్థానం కోల్పోయిన స్టార్ బ్యాట‌ర్ షెఫాలీ వ‌ర్మ టీ20 జ‌ట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. డ‌బ్ల్యూపీఎల్‌-2025లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ర‌పున షెఫాలీ చ‌క్క‌టి ప్ర‌ద‌ర్శ‌న చేసింది. 152.76 స్ట్రైక్‌రేటుతో 304 ప‌రుగులు సాధించింది.

IPL 2025: అయ్యో.. ఇప్పటికే కష్టాల్లో ఉన్న రిషబ్ పంత్ లక్నో జట్టుకు మరో బిగ్‌షాక్.. గాయంతో టోర్నీ నుంచి ఫాస్ట్ బౌలర్ ఔట్.. కొత్తగా ఎవరొచ్చారంటే..

టీ20 సిరీస్ జూన్ 28 నుంచి ప్రారంభం కానుండ‌గా, వ‌న్డే సిరీస్ జూలై 16 నుంచి ఆరంభం కానుంది.

ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు భార‌త మ‌హిళ‌ల వ‌న్డే, టీ20 జ‌ట్లు ఇవే..

భారత మ‌హిళ‌ల వన్డే జట్టు..

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్‌), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీప‌ర్‌), యాస్తికా భాటియా , తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చరణి, కె అరుంధ‌తి రెడ్డి, షుచి అమాన్‌ప్రీత్‌కౌర్ గౌడ్, సయాలీ సత్ఘరే

Punjab kings : పాక్ లీగ్‌ను వదిలి పంజాబ్ జ‌ట్టులో చేరిన డేంజ‌ర‌స్ బ్యాట‌ర్‌.. ప్ర‌త్య‌ర్థుల‌కు ఇక దబిడి దిబిడే?

భారత మ‌హిళ‌ల టీ20 జట్టు..

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్‌), షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీప‌ర్‌), యాస్తికా భాటియా , హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చరణి, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే.