IPL 2025: అయ్యో.. ఇప్పటికే కష్టాల్లో ఉన్న రిషబ్ పంత్ లక్నో జట్టుకు మరో బిగ్‌షాక్.. గాయంతో టోర్నీ నుంచి ఫాస్ట్ బౌలర్ ఔట్.. కొత్తగా ఎవరొచ్చారంటే..

ఐపీఎల్ -2025 పున:ప్రారంభం వేళ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఈ సీజన్ లో రిషబ్ పంత్ సారథ్యంలోని ఆ జట్టు..

IPL 2025: అయ్యో.. ఇప్పటికే కష్టాల్లో ఉన్న రిషబ్ పంత్ లక్నో జట్టుకు మరో బిగ్‌షాక్.. గాయంతో టోర్నీ నుంచి ఫాస్ట్ బౌలర్ ఔట్.. కొత్తగా ఎవరొచ్చారంటే..

Lucknow Super Giants

Updated On : May 16, 2025 / 8:51 AM IST

IPL 2025: ఐపీఎల్ -2025 పున:ప్రారంభం వేళ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఈ సీజన్ లో రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయిట్స్ జట్టు విజయాలు సాధించడంలో కష్టాలు ఎదుర్కొంటుంది. ఇప్పటి వరకు ఆ జట్టు 11 మ్యాచ్ లు ఆడగా.. కేవలం ఐదు మ్యాచ్ లలోనే విజయం సాధించి పాయింట్ల పట్టికలో 10పాయింట్లతో ఏడు స్థాయిలో ఉంది. ఆ జట్టు లీగ్ దశలో ఇంకా మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ప్లే ఆప్స్ కు చేరుకోవాలంటే ఆ మూడు మ్యాచ్ లలోనూ విజయం సాధించాల్సి ఉంది. అప్పటికీ, ప్లే ఆప్స్ కు చేరుకుంటుందన్న గ్యారెంటీ లేదు. ఇతర జట్లపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఆ జట్టుకు ఫాస్ట్ బౌలర్ దూరమయ్యాడు.

Also Read: IPL 2025: ఐపీఎల్ పునః ప్రారంభం వేళ గుజరాత్ టైటాన్స్‌కు బిగ్‌షాక్.. హ్యాండిచ్చిన మ్యాచ్ విన్నర్.. జట్టులోకి శ్రీలంక ప్లేయర్

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ వెన్ను గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. ప్లేఆప్స్ కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న లక్నో జట్టుకు బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. మయాంక్ యాదవ్ గత ఐపీఎల్ సీజన్ లో నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే, గాయంతో కొన్ని నెలలుగా ఆటకు దూరంగా ఉన్న అతను ఈ ఐపీఎల్ సీజన్ లోనూ ఆలస్యంగా జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు రెండే మ్యాచ్ లు ఆడిన మయాంక్ మళ్లీ గాయపడ్డాడు. దీంతో అతను మిగిలిన మ్యాచ్ లకు దూరమయ్యాడు.

Also Read: IPL 2025: ఢిల్లీ జట్టుకు షాకిచ్చిన బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్.. డీసీ ప్రకటించిన కొన్నిగంటలకే యూఏఈకి పయనం..

మయాంక్ స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు న్యూజిలాండ్ పేసర్ విలియం ఓ రూర్క్ ను జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని లక్నో ప్రాంఛైజీ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. ఓ రూర్క్ ను కనీసం ధర రూ.3కోట్లకు లక్నో జట్టులోకి తీసుకుంది.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇంకా మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈనెల 19 (సన్ రైజర్స్ హైదరాబాద్), 22న (గుజరాత్ టైటాన్స్), 27న (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) జట్లతో లక్నో తలపడనుంది.