Kohli ఈజ్ బ్యాక్: ఆసీస్‌తో టీ20, వన్డేలకు భారత జట్లివే

న్యూజిలాండ్ సిరీస్ అనంతరం టీమిండియా సొంతగడ్డపై ఆడుతున్న తొలి సిరీస్ కావడంతో భారీ ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే టీమిండియాలో ఎవరు భాగం కానున్నారోననే ఆసక్తిలో ఉన్న అభిమానుల సందిగ్ధతకు బీసీసీఐ తెరదించింది. రెండు టీ20లకు ఆడనున్న 15 మందితో కూడిన జట్టును ప్రకటించిన బీసీసీఐ.. వన్డేలకు మాత్రం మొదటి, రెండు వన్డేలకు ఒక జట్టు మిగిలిన మూడు వన్డేలకు మరో జాబితాతో జట్లను ప్రకటించింది. 

అన్ని జట్లలో కెప్టెన్ కోహ్లీనే కెప్టెన్‌గా ఉండటంతో విరామం తర్వాత కోహ్లీ ఆడుతున్నాడనే విషయం ఖరారైపోయింది. అతనితో పాటు బుమ్రా కూడా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు సిద్ధమైయ్యాడు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌లు సొంతగడ్డపై ఆస్ట్రేలియాపై విరుచుకుపడేందుకు సిద్ధమైయ్యారు. ఈ మేర వన్డే టోర్నీకి దినేశ్ కార్తీక్ దూరమైయ్యాడు. 

వన్డే ఫార్మాట్‌లో నిరాశపరుస్తున్న కేఎల్ రాహుల్‌కు మరో అవకాశం కల్పించారు సెలక్టర్లు. టీ20లతో పాటు వన్డేఫార్మాట్‌లోనూ జట్టులోకి తీసుకున్నారు. భువనేశ్వర్ కుమార్‌కు టీ20, తొలి 2వన్డేల నుంచి విరామం కల్పించగా, సిద్ధార్థ్ కౌల్ ఆ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్‌లు ఏ ఫార్మాట్‌లోనూ స్థానం దక్కించుకోలేకపోయారు.   

టీ20 సిరీస్ లో ఆడనున్న భారత్:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, రిసబ్ పంత్, దినేశ్ కార్తీక్, మహేంద్ర సింగ్ ధోనీ(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, విజయ్ శంకర్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రిత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, సిద్ధార్థ్ కౌల్, మయాంక్ మార్కండే
 

 

 

 

మొదటి రెండు వన్డేలలో ఆడనున్న టీమిండియా:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, కేదర్ జాదవ్, మహేంద్ర సింగ్ ధోనీ(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, విజయ్ శంకర్, రిషబ్ పంత్, సిద్దార్థ్ కౌల్, కేఎల్ రాహుల్

మిగిలిన మూడు వన్డేలలో ఆడనున్న భారత్:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, కేదర్ జాదవ్, మహేంద్ర సింగ్ ధోనీ(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, విజయ్ శంకర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్