BCCI Central Contracts Boost For Virat Kohli, Rohit Sharma Says Report
టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. అయినప్పటికి వీరిద్దరికి బీసీసీఐ 2025-26 సంవత్సరానికి ఇచ్చే సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ఏ+ గ్రేడ్‌లోనే కొనసాగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
టీమ్ఇండియా తరుపున మూడు ఫార్మాట్లలో ఆడుతున్న వారికి మాత్రమే ఏ+ గ్రేడ్‌లో చోటు కల్పిస్తారు అయితే.. భారత క్రికెట్‌కు రోకో ద్వయం చేసిన అసాధారణ కృషిని దృష్టిలో పెట్టుకుని వారికి ఏ+గ్రేడ్‌లోనే కొనసాగించనున్నట్లు సదరు వార్తల సారాంశం. ఏ+ గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనంగా రూ.7 కోట్లు లభిస్తాయి.
Rohit Sharma : రోహిత్ శర్మ సిక్స్ కొడితే.. సౌండ్ అదిరిపోద్ది..
ఇక దేశవాలీలో ఆడని కారణంగా గతంలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయిన శ్రేయస్ అయ్యర్‌కు తిరిగి జాబితాలో చేర్చే అవకాశాలు ఉన్నాయట. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయంలో అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 243 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచిన సంగతి తెలిసిందే.
‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20లకు వీడ్కోలు చెప్పినప్పటికి కూడా వారికి ఏ+ గ్రేడ్ సెంట్రల్ కాంట్రాక్టు కొనసాగనుంది. వాళ్లు పెద్ద ఆటగాళ్లు, వారికి తగిలిన గౌరవం లభిస్తుంది. శ్రేయస్ అయ్యర్ తిరిగి సెంట్రల్ కాంట్రాక్టులోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు.’ అని బీసీసీఐ వర్గాలు తెలిపినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
Suryakumar Yadav : టీ20ల్లో చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్..
అటు ఇషాన్ కిషన్‌కు సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో చోటు లభించదని తెలుస్తోంది. అతడు మరికొంత కాలం పాటు వేచి చూడక తప్పదని అంటున్నారు. నవంబర్ 2023 నుంచి ఇషాన్ కిషన్ టీమ్ఇండియా తరుపున ఏ ఫార్మాట్‌లోనూ ఆడలేదు. అతడు సెంట్రల్ కాంట్రాక్టులో చోటు కోసం తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది.
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి ప్లేయర్లకు ఎంత వస్తుందంటే..?
గ్రేడ్ ఏ+ ప్లేయర్లకు – రూ.7 కోట్లు
గ్రేడ్ ఏ ప్లేయర్లకు – రూ.5 కోట్లు
గ్రేడ్ బి ప్లేయర్లకు – రూ.3 కోట్లు
గ్రేడ్ సి ప్లేయర్లకు – రూ.కోటి