BCCI Introduces Strict Rules For Young Players Before IPL Entry
BCCI : ఐపీఎల్ ద్వారా ఎంతో మంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. ఐపీఎల్ 2025 సీజన్ ద్వారా 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సత్తా చాటాడు. ఈ యువ ఆటగాడిని రాజస్థాన్ రాయల్స్ 1.1 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. బీహార్‌లో జన్మించిన సూర్య వంశీ తనకు దక్కిన మొత్తానికి న్యాయం చేస్తూ ఐపీఎల్‌లో పలు విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు.
ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 35 బంతుల్లో సెంచరీ బాదాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడిగానూ రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలో అతడి ఆట చూసి మరింత మంది కుర్రాళ్లు ఐపీఎల్‌లో సత్తా చాటాలని భావిస్తున్నారు. అయితే.. వారికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు షాకిచ్చింది.
ఓ కొత్త రూల్ ను బీసీసీఐ తీసుకువచ్చింది. ఐపీఎల్‌లో ఎంట్రీ ఇవ్వాలనే యువ క్రికెటర్లు ఖచ్చితంగా కనీసం ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాలనే నిబంధనను విధించింది. ఆదివారం (సెప్టెంబర్ 28) ముంబైలో జరిగిన వార్షిక సభ్యసమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దేశవాళీ క్రికెట్‌ను మరింత బలోపేతం చేసేందుకు ఈ నిబంధనను తీసుకువచ్చినట్లు తెలిపింది. ఈ నియమం 2026 ఐపీఎల్ నుంచి అమలు చేయబడుతుంది.
ఐపీఎల్‌లో అడుగుపెట్టాలంటే వయసు నిబంధన ఏమీ లేదు. ఈ క్రమంలో ఇప్పటికే చాలా మంది అండర్-19, అండర్-19 క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడారు. దీంతో యువ ఆటగాళ్లు ఎక్కువగా టీ20లపైనే దృష్టి పెడుతున్నారని, టెస్టులు, వన్డేల పై దృష్టి సారించడం లేదని మాజీ క్రికెటర్లు సైతం ఆందోళన చెందారు.
Deepti Sharma : చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. ఒకే ఒక భారత మహిళా క్రికెటర్..
ఇప్పుడు కనీసం ఒక్క ఫస్ట్ క్లాస్ నిబంధనను తీసుకురావడం మంచి నిర్ణయం అని వారు చెబుతున్నారు. దీని వల్ల సుదీర్ఘ ఫార్మాట్‌లో యువ ఆటగాళ్లు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకుంటారని అంటున్నారు.