IND vs SA : తిల‌క్ వ‌ర్మ‌పై ఇర్ఫాన్ ప‌ఠాన్ కామెంట్స్‌.. వ‌న్డేల్లో అత‌డిని..

భార‌త్, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య (IND vs SA ) న‌వంబ‌ర్ 30 నుంచి మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ ప్రారంభం కానుంది.

IND vs SA : తిల‌క్ వ‌ర్మ‌పై ఇర్ఫాన్ ప‌ఠాన్ కామెంట్స్‌.. వ‌న్డేల్లో అత‌డిని..

Irfan Pathan On Tilak Varma Picked For South Africa ODIs

Updated On : November 24, 2025 / 2:59 PM IST

IND vs SA : భార‌త్, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య న‌వంబ‌ర్ 30 నుంచి మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ ఆదివారం 15 మంది స‌భ్యుల‌తో కూడిన భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది. రెగ్యుల‌ర్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ మెడ‌గాయంతో దూరం కాగా.. కేఎల్ రాహుల్ జ‌ట్టుకు నాయ‌క‌త్వం వహిస్తున్నాడు.

వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ తో పాటు రుతురాజ్ గైక్వాడ్ లు తిరిగి వ‌న్డే జ‌ట్టులోకి వ‌చ్చాడు. ఆస్ట్రేలియా పర్యటనకు దూరమైన తర్వాత వెటరన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా తిరిగి వచ్చాడు. వ‌న్గేల్లో రెగ్యుల‌ర్‌గా నంబ‌ర్ 4లో ఆడే శ్రేయ‌స్ అయ్య‌ర్ గాయం సిరీస్‌కు అందుబాటులో లేక‌పోవ‌డంతో అత‌డి స్థానంలో తిల‌క్ వ‌ర్మ‌ను జ‌ట్టులోకి తీసుకున్నారు.

IND vs SA : కెప్టెన్ అంటే ఇలా ఆడాలి? రిష‌బ్ పంత్ బ్యాటింగ్ పై సెటైర్లు..

దీనిపైనే టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు ఇర్ఫాన్ ప‌ఠాన్ స్పందించాడు. వ‌న్డేల్లో తిల‌క్ వ‌ర్మ‌ను నాలుగో స్థానంలో ఆడిస్తే అత‌డు చాలా బాగా రాణించ‌గ‌ల‌డ‌ని చెప్పాడు. టీ20ల్లోనే కాదు వ‌న్డేల్లోనూ రాణించే స‌త్తా తిల‌క్‌కు ఉంద‌న్నాడు. ఆసియా క‌ప్ ఫైన‌ల్‌లో పాక్ జ‌ట్టుపై చ‌క్క‌గా రాణించి టీమ్ఇండియా టైటిల్ కైవ‌సం చేసుకోవ‌డంలో కీల‌క పాత్ర పోషించిన విష‌యాన్ని గుర్తు చేశాడు.

తిల‌క్ ముందుగా క్రీజులో కుదురుకునేందుకు ప్ర‌య‌త్నిస్తాడ‌ని, ఆ త‌రువాత ఒత్తిడిని స‌మ‌ర్థ‌వంగా ఎదుర్కొని ప‌రుగులు సాధిస్తాడ‌ని చెప్పాడు. అత‌డు వికెట్ల మ‌ధ్య చాలా చురుకుగా ప‌రుగులు తీస్తాడ‌ని, స్లాగ్ స్వీప్ వంటి షాట్‌లను సమర్థవంతంగా ఆడ‌తాడ‌ని తెలిపాడు.

Salman Ali Agha : చ‌రిత్ర సృష్టించిన పాక్ టీ20 కెప్టెన్ స‌ల్మాన్ అలీ అఘా.. రాహుల్ ద్ర‌విడ్ వ‌ర‌ల్డ్ రికార్డు బ్రేక్‌..

దక్షిణాఫ్రికాతో వ‌న్డే సిరీస్ కోసం భార‌త జ‌ట్టు ఇదే..

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్‌ రాహుల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్‌), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌, అర్ష్ దీప్ సింగ్, ధ్రువ్ జురెల్‌.