Vaibhav Suryavanshi : ఏందీ ఆ కొట్టుడు సామీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 9 ఫోర్లు, 8 సిక్సర్లు.. వరల్డ్ రికార్డు..
టీమ్ఇండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అరుదైన ఘనత సాధించాడు.

Vaibhav Suryavanshi creates all time record for India in Youth Tests
Vaibhav Suryavanshi : టీమ్ఇండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆస్ట్రేలియా గడ్డ పై పరుగుల వరద పారిస్తున్నాడు. యూత్ వన్డే క్రికెట్‌లో పలు విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడిన సూర్య వంశీ(Vaibhav Suryavanshi).. యూత్ టెస్టు క్రికెట్‌లోనూ చెలరేగుతున్నాడు. ఆస్ట్రేలియా అండర్ 19తో జరుగుతున్న తొలి యూత్ టెస్టులో 78 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి.
ఈ క్రమంలోనే చరిత్ర సృష్టించాడు. యూత్ టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలో కెప్టెన్ ఆయుష్ మాత్రే ను అధిగమించాడు. మాత్రే 9 సిక్సర్లు బాదగా సూర్యవంశీ 14 సిక్సర్లు కొట్టారు. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా సూర్యవంశీ 86 బంతులు ఎదుర్కొన్నాడు. 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 113 పరుగులు సాధించాడు.
Deepti Sharma : చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. ఒకే ఒక భారత మహిళా క్రికెటర్..
ఆస్ట్రేలియా గడ్డపై ఫాస్టెస్ట్ సెంచరీ..
వైభవ్ సూర్యవంశీ మరోరికార్డును నెలకొల్పాడు. ఆస్ట్రేలియా గడ్డపై యూత్ టెస్టుల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు బ్రెండన్ మెక్‌కల్లమ్ పేరిట ఉండేది.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. అనంతరం వైభవ్ సూర్యవంశీ(113 ), వేదాంత్ త్రివేది( 140) శతకాలతో చెలరేగడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో79 ఓవర్లు ముగిసే సరికి 9 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. అన్మోల్జీత్ సింగ్(1), దీపేష్ దేవేంద్రన్ (9)లు క్రీజులో ఉన్నారు.