బీసీసీఐలో సెలక్టర్ల పోస్ట్‌లు.. దరఖాస్తుకు అర్హతలు ఇవే!

  • Publish Date - November 11, 2020 / 10:28 AM IST

bcci

BCCI:అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడాలంటే బీసీసీఐలో కీలకం అయిన సెలెక్టర్ల కమిటీలో ఉద్యోగాలు త్వరలో ఖాళీ అవుతున్నాయి. ఈ కమిటీలో ఖాళీ అవుతున్న సెలక్టర్లను భర్తీ చేసేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) రెడీ అయ్యింది. అర్హత గల అభ్యర్థులు నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది బీసీసీఐ.



సెలెక్షన్ కమిటీలో సెలెక్టర్లుగా నియామకం కావాలంటే.. దరఖాస్తులను ఈ నెల 15వ తేదీలోగా పంపాలని కోరింది బీసీసీఐ. కమిటీలోని దేవాంగ్‌ గాంధీ (ఈస్ట్‌జోన్‌), శరణ్‌దీప్‌ సింగ్‌ (నార్త్‌జోన్‌), జతిన్‌ పరాంజపే (వెస్ట్‌జోన్‌)ల పదవీ కాలం ఇప్పటికే ముగియగా.. ఆసీస్‌ పర్యటన కోసం జట్టును సెలెక్ట్ చెయ్యడానికి వారి పదవీకాలం పొడిగించింది బోర్డు.



https://10tv.in/be-careful-with-online-cheatings-and-online-shopping-frauds/
అయితే ఇప్పుడు జట్ల ఎంపిక పూర్తి కాగా.. ఇప్పుడు సెలక్టర్ల పోస్ట్‌లను భర్తీ చెయ్యడానికి కార్యాచరణ మొదలు పెట్టింది బీసీసీఐ. సౌత్‌జోన్‌ నుంచి ఖాళీ అయిన ఎమ్మెస్కే ప్రసాద్‌(ఆంధ్రప్రదేశ్‌) స్థానంలో సునీల్‌ జోషి(కర్ణాటక), సెంట్రల్‌ జోన్‌లో గగన్‌ ఖోడా స్థానంలో హర్వీందర్‌ సింగ్‌లను ఇప్పటికే నియమించింది బీసీసీఐ.



సెలక్టర్ పోస్ట్‌లకు అర్హతలు ఇవే:
ఇంటర్నేషనల్ క్రికెట్ అనుభవం లేకపోయినా కూడా దేశవాళీ క్రికెట్‌లో మాత్రం కనీసం 30మ్యాచ్‌లలో ఆడి ఉండాలి. క్రికెటర్లు సెలక్టర్ల పదవులకు దరఖాస్తు చేసుకోవలసినవారి గరిష్ట వయస్సు 60 ఏళ్లు. అంతర్జాతీయ క్రికెట్‌లో 7 టెస్టులు లేదంటే 10 వన్డేలు, 20 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండాలి. 30 దేశవాళీ మ్యాచ్‌లు ఆడినా చాలు. ఈ సీనియర్‌ సెలక్షన్ కమిటీ భారత్‌తో పాటు భారత్‌ ‘ఎ’, దులీప్‌ ట్రోఫీ, దేవధర్‌ ట్రోఫీ, చాలెంజర్‌ ట్రోఫీ, రెస్టాఫ్‌ ఇండియా జట్లను ఎంపిక చేస్తుంది.