BCCI: ’19 ప్లస్’ జట్టును ప్లాన్ చేస్తోన్న బీసీసీఐ.. వారి కోసమే!

కమల్ పాసి కొన్ని సీజన్‌ల క్రితం పంజాబ్ తరపున కొన్ని మ్యాచ్‌లు ఆడాడు.. రవికాంత్ సింగ్ కూడా..

Bcci Chief Medical Officer Abhijit Salvi Resigns Due To Personal Reasons

BCCI: కమల్ పాసి కొన్ని సీజన్‌ల క్రితం పంజాబ్ తరపున కొన్ని మ్యాచ్‌లు ఆడాడు.. రవికాంత్ సింగ్ కూడా అలాగే.. మన్జోత్ కల్రా.. ఈ ఆటగాళ్లందరూ U-19 ప్రపంచ కప్ విజేతలు అయినప్పటికీ కాలక్రమేణా వారి ప్రభావం క్రికెట్‌లో కనిపించలేదు. ఇప్పుడు ఇదే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీరియస్‌గా వ్యవహరిస్తోన్న అంశం.

ఇటువంటి ఆటగాళ్ల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు జాతీయ క్రికెట్ అకాడమీ(NCA) ’19 Plus'(19ఏళ్లు పైబడిన) ఆటగాళ్లతో ఓ విభాగం ఏర్పాటు చెయ్యాలని భావిస్తోంది. అండర్ 19 దాటిన తర్వాత కూడా అండర్-19 స్థాయి ఆటగాళ్లు క్రికెట్ వ్యవస్థలో భాగంగా కొనసాగేలా ప్లాన్ చేస్తుంది. భారత్ ఐదోసారి అండర్-19 వరల్డ్ కప్ గెలడంతో బీసీసీఐ ఈ కొత్త ఆలోచన చేస్తుంది. ఆటగాళ్లు కనుమరుగు కాకుండా ఓ విభాగం ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

షేక్ రషీద్ (ఆంధ్రా), రవి కుమార్ (బెంగాల్), రాజ్ అంగద్ బావా (చండీగఢ్), యష్ ధుల్(ఢిల్లీ) ఇప్పటికీ తమ రాష్ట్ర జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు.. ప్రస్తుత భారతదేశం అండర్-19 జట్టు నుంచి చాలా మంది ఆటగాళ్ళు ఇలా ఉన్నారు. భారత దేశీయ వ్యవస్థ రాష్ట్ర స్థాయిలో అండర్-23 జట్లను కలిగి ఉంది, అయితే ఇది తరువాత అండర్-25కి మార్చబడింది. ఈ వర్గంలో ఇప్పటికే చాలా మంది పోటీదారులు ఉన్నారు.

బీసీసీఐ సీనియర్ అధికారి ఈ పరిస్థితిపై మాట్లాడుతూ, “భారత సీనియర్ జట్టు కోసం ఆటగాళ్లను అభివృద్ధి చేయడానికి జాతీయ క్రికెట్ అకాడమీ భవిష్యత్తులో ఐదు వ్యవస్థలపై పని చేస్తుంది. ప్రస్తుతం ఇది అండర్-16తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అండర్-19, ఎమర్జింగ్ (నేషనల్ అండర్-23), గ్రూప్-A జట్టు.

కొత్త అండర్‌-19+ వయో విభాగం జట్టును ఏర్పాటు చేయాలని బోర్డు యోచిస్తుంది. తద్వారా 19 ఏళ్లు దాటిన అండర్‌-19(under-19) ప్రతిభావంతులు క్రికెట్‌ వ్యవస్థ పరిధిలో ఉండేలా జాతీయ క్రికెట్‌ అకాడమీ (NCA) పర్యవేక్షణలో వాళ్లు పురోగతి సాధించేలా చూడాలని ఆలోచిస్తోంది.