Bcci President Sourav Ganguly Opens Up On Rohit Sharma Being Named India's Odi Skipper
Sourav Ganguly : టీమిండియా వన్డే కెప్టెన్ మార్పుపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ క్లారిటీ ఇచ్చాడు. టీమిండియా టీ20 కెప్టెన్ గా విరాట్ కోహ్లీ కొనసాగేందుకు నిరాకరించినట్టు గంగూలీ తెలిపాడు. కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మకు వన్డే పగ్గాలు అప్పగించాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నారని గంగూలీ వెల్లడించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కోహ్లీ, రోహిత్ శర్మ వేర్వేరు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.
2023 వన్డే ప్రపంచ కప్‌కు వెళ్లే వన్డే జట్టుకు రోహిత్‌ను కెప్టెన్‌గా బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు గంగూలీ స్పష్టం చేశాడు. టీ20 కెప్టెన్‌గా వైదొలగవద్దని మేం విరాట్‌ను అభ్యర్థించాము. కానీ అతను కెప్టెన్‌గా కొనసాగేందుకు నిరాకరించాడు. రెండు వైట్-బాల్ ఫార్మాట్‌లలో ఇద్దరు వైట్ బాల్ కెప్టెన్‌లు ఉండరాదని సెలక్టర్లు భావించారని భారత మాజీ కెప్టెన్ గంగూలీ తెలిపాడు. అక్టోబరు-నవంబర్‌లో జరిగిన ప్రపంచకప్‌లో భారత్ ఘోరమైన పరాభావాన్ని ఎదుర్కొంది.
ఆ తర్వాత కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. వైట్ బాల్ ఫార్మాట్‌లో గందరగోళానికి దారితీసే అవకాశం ఉందని సెలక్టర్లు భావించారని, అందుకే చేతన్ శర్మ నేతృత్వంలోని కమిటీ కెప్టెన్ అవసరమని సూచించిందని గంగూలీ చెప్పుకొచ్చాడు. వన్డేలకు, టీ20లకు ఒకరే కెప్టెన్‌గా ఉండాలనేది సెలెక్టర నిర్ణయమని తెలిపాడు. మరోవైపు.. భారత క్రికెట్‌కు సంబంధించి విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై పెద్ద చర్చే జరిగింది.
విరాట్ కోహ్లీ.. ప్రస్తుత క్రికెటర్లలో అత్యుత్తమ క్రికెటర్.. కెప్టెన్‌గానూ కోహ్లీకి మంచి రికార్డు ఉంది. టీ20ల మాదిరిగానే వన్డేలకు కూడా కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడని అందరూ అనుకున్నారు. కానీ, విరాట్‌కు కూడా చెప్పకుండా అతన్ని కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించేందనే వార్త బయటకు వచ్చింది. దీనిపై కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కోహ్లీ సారథ్యంలోని 95 మ్యాచ్‌లలో 70 శాతానికి పైగా టీమిండియా విజయాల రికార్డులను నెలకొల్పింది.
Read Also : Paytm Payments Bank : పేటీఎంకు ఆర్బీఐ గుడ్‌న్యూస్..!